‘హిందుత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

ముస్లింల పేదరికం, అభద్రతాభావం, వివక్ష, అణచి వేత, హిందూత్వ దాష్టీకం, బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ ముస్లిం జాతి మేధం, ముస్లిం సంస్కృతి, ముస్లిం స్త్రీలు, దూదేకులు-ఇతర సమూ హాల ముస్లింలు, ముస్లిం ఛాందసత్వం తదితర అంశాలపై విస్తృ తంగా కవిత్వం, కథలు ఈ రచయితల నుంచి వచ్చాయి. అందులో మెజారిటీ మత భావజాలం వల్ల ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష, అణచివేతల గురించి వచ్చిన కవిత్వాన్ని ఇక్కడ పరిచం చేసు కుందాం.

హిందీ హిందూ హిందుస్తాన్‌

ముస్లిం జావో పాకిస్తాన్‌

ముసల్మాన్‌ కే దో హీ స్తాన్‌

పాకిస్తాన్‌ యా ఖబ్రస్తాన్‌

– ఖాదర్‌ మొహియుద్దీన్‌

ఇలాంటి ఒక నినాదం రూపొందించి ముస్లింలను శత్రువులుగా, రకరకాలుగా ప్రచారం చేసి, వారిని పాకిస్తాన్‌కు పార ద్రోలడమో లేదా చంపివేయడమో చేయాలని ముస్లిమేతరుల నంద రినీ రెచ్చగొట్టిన హిందుత్వవాదుల చర్యను ఖాదర్‌ మొహియుద్దీన్‌ తన దీర్ఘ కవిత ‘పుట్టుమచ్చ’లో ప్రశ్నించారు.

పై భావజాలంలో నుంచే వచ్చిన మరొక నినాదం ‘భారతదేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే!’

స్వతంత్ర ఇండియాలో మత స్వాతంత్య్రపు హక్కు ఉంది.  వాళ్లకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉండొచ్చు. వందేమాతరం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గీతమే అయినా ‘పాడాల్సిందే’ అనే నియంతృత్వం సరైంది కాదుకదా! ఈ గీతం వెనక కూడా మళ్లీ అదే భావజాలం.. ‘ఆనంద్‌మఠ్‌’ నవలలో ముస్లింలను పారద్రోలాలని, లేదంటే చంపివేయాలని ఓ పాత్ర ద్వారా చెప్పిస్తాడు బంకించంద్ర. మరి అటువంటి నవలలోని వందేమాతరం గీతాన్ని పాడాల్సిందేనని ఇప్పుడు బలవంతం చేయడం సరైంది కాదు. అట్లే ఆ గీతంలో ఇండియాను దుర్గా మాతతో పోల్చడం, తలవంచి నమస్కరించడం ఉంటుంది. ముస్లింలు తాము అల్లా ముందు తప్ప ఇంకెవరి ముం దూ తలవంచం అంటున్నారు. అలాంటప్పుడు బలవంతపెట్టడం తగదు.ఇక మరో నినాదం ‘భారతదేశం అంటే ధర్మసత్రం కాదురా’ అనేది. ఇలాంటి దారుణమైన నినాదాలు తయారు చేసి ముస్లింలపై విషం చిమ్ముతూ వస్తున్నది హిందుత్వవాదం. ఇలాంటి నినాదాలు చూసినప్పుడు, విన్నప్పుడు సామాన్య ముస్లింల మనోభావాలు ఎంత గా దెబ్బతిని ఉంటాయో’, ఎంతగా వాళ్లు మానసిన హింసకు గురై ఉంటారో ఒక్కసారి ఆలోచించాలి…

వాళ్లూ వాళ్లూ కలిసి పంచుకున్న ఊళ్ల మధ్య

నా రక్తం ఏరులై పారింది

అంటాడు ఖాదర్‌ మొహియుద్దీన్‌ (తన తొలి ముస్లింవాద దీర్ఘ కవిత పుట్టుమచ్చలో). నిజం కాదా! దేశ విభజనతో ఇక్కడి సామాన్య ముస్లింలకు ఏం సంబంధం. పెద్దలమనుకున్న వాళ్ల మధ్య తేడా లొచ్చి తీసుకున్న నిర్ణయం ఎంతటి రక్తపతాన్ని సృష్టించిందో తెలి సిందే! దేశ విభజన నాటి రక్తపాతం ప్రపంచంలోనే మహా విషాదం. పక్కవాడు అనుమానంగా చూస్తున్నా, తరిమివేయాలని చూస్తున్నా, ఉన్న ఊరు-కన్నతల్లిని వదిలి వెళ్లలేక, తమ మూలాన్ని, వేర్లను తెంచుకుని వెళ్లలేక పుట్టిన గడ్డనే హత్తుకుని ఉండిపోయిన ఈ దేశపు ముస్లిలకు ఎంతటి దుర్గతి పట్టించారు ఇక్కడి పాలకులు, హిందుత్వవాదులు. అనుదినం అవమానపరుస్తూ మాతృదేశంలోనే ముస్లింల మనసుల్ని ఛిద్రం చేశారు. చివరికి రోడ్డుసైడు చిల్లర వ్యాపారాలకు మాత్రమే ముస్లింలు పరిమితం అయ్యేలా చేశారు. అలా తమ బతుకు తాము బతుకుతున్నప్పటికీ…

పార్లమెంట్‌ భవనంలో వాలేందుకు

నా నెత్తురు పాదలేపనమవుతుంది..

నా రక్తం పదవీసోపానానికి

అభయ ‘హస్త’మవుతుంది

నా రక్తం ‘భరతమాత’ నుదిటి

తిలకమవుతుంది, పూజా ‘కమల’మవుతుంది

అంటూ మతోన్మాదులు, రాజకీయ పార్టీలు ముస్లింలను ఎలా వాడుకుంటున్నదీ కవిత్వీకరిస్తారు ఖాదర్‌ మొహియుద్దీన్‌.

క్రికెట్‌మేచ్‌ నా దేశభక్తికి / తూనికా, కొలమాన మవుతుంది / నేను నా మాతృదేశాన్ని / ఎంతగా ప్రేమిస్తున్నాన నన్నది కాదు / ఏయే పరాయి దేశాన్ని ఎంతెంతగా ద్వేషిస్తున్నా నన్నదే / నా దేశభక్తికి ఎంతో కొంత ఆధారమవుతుంది – అంటూ చివరికి క్రికెట్‌ ఆట కూడా ముస్లింలను అనుమానించడానికి ఒక సాకు కావడాన్ని ఖాదర్‌ ప్రశ్నించారు.

నేను పుట్టకముందే

దేశద్రోహుల జాబితాలో

నమోదై వుంది నా పేరు

అన్న ఖాదర్‌ పాదాలతో సాహిత్యలోకం ఉలిక్కిపడిందంటే అతిశయో క్తికాదు. ‘కన్నబిడ్డని సవతి కొడుకుగా / చిత్రించింది చరిత్ర / అన్నదమ్ముల్నించి చీల్చి నన్ను ఒం టరివాణ్ని చేసింది చరిత్ర’ అన్న ఖాదర్‌ వాక్కులు ముమ్మాటికీ నిజం.ఈ కవితతోనే తెలుగు సాహి త్యంలో ముస్లింల అభివ్యక్తి మొద లైంది. అంతకుముందు ఇస్మాయి ల్‌, వజీర్‌ రహమాన్‌, స్మైల్‌, కౌము ది, దిలావర్‌, దేవిప్రియ, గౌస్‌, అఫ్సర్‌, యాకూబ్‌ లాంటి కవులు న్నప్పటికీ పుట్టుమచ్చకు ముందు వాళ్లు తాము ముస్లిం కవులుగా రాసింది లేదు.బాబ్రీ వివాదాన్ని రెచ్చగొడుతూ హిందుత్వ రెచ్చగొ డుతూ హిందుత్వ భావజాలాన్ని పెంచిపోషిస్తూ ముస్లింపైకి ముస్లిం మేతర సమాజాన్ని మొత్తంగా ఉసి గొల్పలని ఆరెస్సెస్‌ ఫాసిస్టు శక్తులు పనిగా పెట్టుకున్నాయి. రాజకీ యంగా బలపడడానికి రామ మందిర నిర్మాణాన్ని ఎత్తుకున్న ఈ శక్తులు అద్వానీ రథయాత్రతో మరింత పెచ్చరిల్లాయి. ఈ సంద ర్భంలోనే ఒక ముస్లిం కవి హృదయంలో ‘పుట్టుమచ్చ’ కవిత రూపుదిద్దుకుంది. 1991లోనే ఈ కవిత అచ్చయింది.1992లో బాబ్రీ మజీదు కూల్చబడింది. దాంతో దేశం మొత్తంలోని లౌకికవాదులైన ముస్లింలమన్న స్పృహలోకి రావలసి వచ్చింది. దాంతో అన్నాళ్లు ముస్లిం లుగా మాట్లాడని ముస్లిం మేధావు లు, కవులు, రచయితలు, ఆలోచ నాపరులంతా ముస్లింగా మాట్లా డాల్సిన అవసరాన్ని గుర్తించారు. తెలుగులోనూ అఫ్సర్‌, యాకూబ్‌, ఇక్బాల్‌చంద్‌, హనీఫ్‌ లాంటి వార ంతా ముస్లింలుగా తమ ఫీలింగ్స్‌ కవిత్వీకరించారు. అదే సంద ర్భంలో ‘కంజిర’ బులెటిన్‌ బాబ్రీ కూల్చివేతను పురస్కరించుకుని ఒక సంచిక వేసింది. అందులో పైకవులున్నారు.ఈక్రమంలో తెలు గు సాహిత్యంలో దళిత సాహిత్యం ఊపందుకుంది. వారి సాన్ని హితంలో, దళితవాదం అందించిన స్ఫూర్తితో ఖాజా, నల్గొండ దళిత బహుజన కవులు, ముఖ్యంగా సుంకెరెడ్డి నారాయణరెడ్డి ప్రోత్సా హంతో స్కైబాబ ముస్లింవాద కవితలు రాశారు.1995 జనవరిలో వచ్చిన ‘చిక్కనవుతున్నపాట’ సంకలనంలో అచ్చయిన ఖాజా, అబ్బా స్‌, అఫ్సర్‌, యాకూబ్‌, ఇక్బాల్‌చంద్‌ల ముస్లిం కవితలు న్నాయి.దేశభక్తి గురించి తెలుగుసాహిత్యంలో ఎంతో కవిత్వం వచ్చింది. ముస్లిం కవి తనను అవమానిస్తున్న, అనుమానిస్తున్న మె జారిటీ మత భావజాలమున్న సమాజాన్ని ధైర్యంగా ప్రశ్నించడం 1998లో వచ్చిన ముస్లింవాద కవితా సంకలం ‘జల్‌జలా’లో చూస్తాం.

ఈ దేశపటాన్ని చుట్టిచుట్టి నీ తలకింద పెట్టుకోవడానికి

అది నీ అయ్య జాగీరు కాదు / అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి అంటూ నిలదీస్తాడు సయ్యద్‌ గఫార్‌.

ఇలా ఎంతో మంది ముస్లిం కవులు మెజారిటీ మత భావజాలాన్ని, మతోన్మాదాన్ని ప్రశ్నించారు. ఈలోగా 2002 సంవ త్సరంలో భారతదేశ చరిత్రలో మొదటిసారిగా జెనోసైడ్‌ ఒకటి చోటుచేసుకుంది. గోద్రాలో ఓ రైలు డబ్బాను తగులబెట్టారనే నెపంతో వేలమంది ముస్లింల ఊచకోత సాగింది. దానికి బీజేపీ, ఆరెస్సెస్‌, శివసేన, భజరంగదళ్‌     తదితర సంఘ్‌ పరివార్‌ శక్తు లు నాయకత్వం వహించాయని ఎన్నో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడి యా, మేధావులు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు తమ వార్తా కథనాల ద్వారా, రిపోర్టుల ద్వారా, పుస్తకాల ద్వారా రికార్డు చేశారు. ఆ నేపథ్యంలో దేశమంతా ఎన్నోరకాల నిరసన వ్యక్తమయింది. తెలుగు సాహిత్యంలోనూ వందలకొద్ది కవితలు, కథలు, వ్యాసాలూ అచ్చయ్యాయి. ‘గుజరాత్‌ గాయం’ పేరుతో 200 మందికి పైగా కవుల సంకలనం ఒకటి ప్రచురింపబడింది. అన్వర్‌, స్కైబాబ సంపా దకత్వంలో ‘అజా’ పేరుతో ముస్లిం కవుల సంకలనం ఒకటి గుజరాత్‌ నరమేధంపై వెలువడింది.ఆ సంకలనానికి ముందుమాట రాస్తూ ప్రముఖ కవి స్మైల్‌ ఇలా అన్నారు- ‘ఈ సంకలనం.. గుండె వుంటే చదవాలి. దిటవు చేసుకు చదవాలి. లేకుండా చదివిన వారికి ఓ గుండె ఏర్పడి స్పందిస్తుంది. వీరి విషాద కవిత్వ నేపథ్యంలో ఒక ఆలోచన ప్రత్యామ్నాయాల, ఐడెంటీల దిశగా అంకురిస్తుంది. ఆ అంకురం కోసమే.. ఈ సంకలనం’.అన్వర్‌ తన సంపాదకీయంలో ‘దేశపతాకంలోని కాషాయం తెలుపును ఆక్రమించేస్తోంది’ అన్నారు.36 మంది కవుల కవితలున్న ఈ సంకలనం ఓక జాతి మేధాన్ని ప్రశ్నించిన సంకలనంగా సమీక్షకుల చేత రికార్డు చేయబడింది.గర్భంలోనున్న ఒక స్త్రీ కడుపుని చీల్చి పిండాన్ని బైటికి తీసి త్రిశూలంతో ఆడించి మంటల్లో వేసిన సంఘటన యావత్‌ భారతదేశాన్ని కదిలించివేయడం తెలిసిందే. ఆ విషయాన్ని ముస్లిం కవులు హృదయవిదారకంగా కవిత్వీకరించడం చూస్తాం.

మధ్యయుగాల అంధాయుధం అంచున

శాంతి ఆశ్రయం సాక్షిగా కలి ఘనీభవించిన

ఆ.. రక్త కణాన్ని నేనే.. నే.. అమ్మా!

– సయ్యద్‌ గఫార్‌

ఇప్పుడు మాతృగర్భంలోంచే

పెకిలించబడుతున్న మా ఉనికి

– వలీహుసేన్‌

భారత దేశం సెక్యులర్‌ దేశం అని ప్రపంచమంతా కొనియాడుతుంటే గుజరాత్‌ నరమేధం మాత్రం ఇక్కడ హిందుత్వ ఫాసిజం రాజ్యమేలుతున్నట్లు స్పష్టం చేసింది. దాంతో మనస్తాపం చెందిన ఓ ముస్లిం కవి ఇలా అన్నాడు.

మితృలారా!

‘కఫన్‌’ కప్పబడిన సెక్యులరిజం జనాజాకు

మీ భుజం ఖాళీ వుంటే పట్టండి    – మహమూద్‌

– స్కైబాబ

జఖ్మీ ఆవాజ్‌ నుంచి

(మిగతా భాగం సోమవారం సంచికలో…)