హింసను ప్రేరేపించినందుకు అస్సాం ఎమ్మెల్యే అరెస్టు

గౌహతి: మత ఘర్షణలు రెచ్చగొట్టారన్న అభియోగాలపై అస్సాంలో ఆధికార కాంగ్రెస్‌ మిత్రపక్షమైన బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌) ఎమ్మెల్యేను ఆరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా ముస్లిం సంస్థ బంద్‌కు పిలుపునివ్వడంతో దిగువ అస్సాంలో జనజీవనం స్తంభించింది. కోక్రఝార్‌ పశ్చిమ నియోజకవర్గం బీపీఎఫ్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ బ్రహ్మ అలియాస్‌ గారాను ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. తాజా హింసపై ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ పౌరసమాజం ప్రతినిధులతో సమావేశమయ్యారు. వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు.