హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుపుదిశగా పయనిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ తదుపరి రౌండ్లలో కాంగ్రెస్‌ దూసుకుపోయింది. మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్‌ 35, భాజపా 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌నేత వీరభద్రసింగ్‌కు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.