హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మోర్ జిల్లా సిలాయ్ సమీపంలో జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. జీపులో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తుండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.



