హుస్సేన్‌సాగర్ వద్ద నిర్మాణాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద సంజీవయ్య పార్కుకు సమీపంలో జీహెచ్‌ఎంసీ తలపెట్టిన నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు సోవవారం ఆదేశించింది. హుస్సేన్‌సాగర్ జలాశయ ప్రాంతంలో చెత్త వాహనాల పార్కింగ్, నిర్వహణ, చెత్త నిల్వ కోసం డిపో నిర్మాణాలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ సమన్వయ కర్త డాక్టర్ జస్వీన్ జైరథ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. జలాశయాలు, వాటి పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుఊడదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.



