హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఘోష్‌ ప్రమాణం

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పినాకి చంద్రఘోష్‌ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఘోష్‌ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిజీపీ దినేష్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు.