హైదరాబాద్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి
ఘనంగా వీడ్కోలు పలికిన పార్టీ నాయకులు
కోరుకొండ : రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోల్లప్రోలు నుంచి హెెలికాప్టర్ ద్వారా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని జెట్ ఎయిర్వేస్ విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరిదేవి, కె,.వి. సత్య నారాయణరెడ్డి, రౌతు సూర్యప్రకాశ్‌రావులు సీఎంకు వీడ్కోలు పలికినవారిలో ఉన్నారు.