హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం: మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 30 కల్లా హైదరాబాద్‌ను సుందర నగరంగా రాష్ట్ర పురపాలక శాఖమంత్రి మహీధర్‌రెడ్డి అన్నారు. జీవ వైవిధ్య సదస్సు కోసం జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. లక్డీకాపూల్‌లోని రైల్వే ఓవర్‌బ్రిడ్జినుంచి ప్రారంభమైన మంత్రి పర్యటన నాగార్జున సర్కిల్‌, మాదాపూర్‌లోని హైటెక్స్‌, గచ్చిబౌలివరకు సాగింది. భారీ వర్షాల వల్లనే పనుల్లో ఆలస్యం జరిగిందని మంత్రి వెల్లడించారు.