హైదరాబాద్‌లో దళిత సంఘాల ధర్నా

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని ఆక్షేపిస్తూ దళిత సంఘాలు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించాయి. సోమవారం టాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన చేపట్టిన దళిత సంఘాల  నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితులపై మారణాయుథాలతో దాడిచేసి ఐదుగురిని హతమార్చినా ఇప్పటికీ దోషులను శిక్షించటంలేదని దళిత సంఘాలు ఆరోపించారు. మరణించినవారు  కుటుంబాలకు నామమాత్రపు నష్టపరిహారం మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారంగా ప్రత్యేక కోర్టును లక్ష్మీపేటలో ఏర్పాటుచేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.