హైదరాబాద్‌లో సయాని హెల్త్‌వరల్డ్‌పై దాడి

హైదరాబాద్‌: వైద్యరంగంలో శస్త్రచికిత్స విభాగానికి చెందిన పలు పరికరాలను విక్రయించే సయాని హెల్త్‌ వరల్డ్‌ కేంద్రంపై లీగల్‌ మెట్రొలజీ విభాగం అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఖైరతాబాద్‌లో ఉన్న ఈ కేంద్రంలో విక్రయిస్తున్న పరికరాలపై అసలు ధరలతో సంబంధం లేకుండా సొంతంగా తయారు చేసిన స్టిక్కర్లు అతికించి వాటి ప్రకారం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఒక కొనుగోలుదారు కంట్రోల్‌రూంకు ఫ్లైయింగ్‌స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఆసిస్టెంట్‌ కంట్రోలర్‌ కె, భాస్కర్‌ నేతృత్వంలో ఖైరతాబాద్‌లోని సయాని హెల్త్‌వరల్డ్‌పై  దాడులు జరిపింది.