ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లమర్రి పుల్లారావుఅధ్వర్యంలో
నేరేడుచర్ల చౌరస్తాలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా ఎంపిడివో శంకరయ్య, డాక్టర్ పున్నా నాగిని, హుజూర్నగర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులు నేరేడుచర్ల గ్రంధాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గుర్రం మార్కండేయ పాల్గొన్నారు.అనంతరం
వీరికి నేరేడుచర్ల మండల పద్మశాల సంఘం తరఫున ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా మార్కండేయ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కేంద్రం చేనేతపై జిఎస్టి విధించి చేనేత కార్మికుల నడ్డి విరిచింది కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు వందల కోట్లు చేనేత శాఖకు కేటాయించి చేనేత కార్మికుల ఆకలి చావులకు కారణమైనది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 1200 కోట్ల రూపాయలను చేనేతకు కేటాయించి వివిధ పథకాలు తెచ్చి చేనేత కార్మికులను ఆదుకుంటున్నది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి ముశం నరసింహ,చెరుకుపల్లి నరసింహ, మాజీ అధ్యక్షులు నక్క రామచంద్రయ్య,బాలన సైదులు, ఉపాధ్యక్షులు నక్కగిరి,ప్రచార కార్యదర్శి రావిరాల యుగేందర్, ఎర్రమాధ చంద్రమౌళి,నక్క శ్రీనివాస్, కొంగరి శ్రీనివాస్, చిలువేరు సోమశేఖర్ రెబ్బసత్యనారాయణ, ఎర్రమద శేఖర్, చిట్టిపోలు ఉపేందర్,చిలువేరు ఉపేందర్ రావిరాల రమేష్, చిట్టిపోలు చిన్నశీను, విప్ప నాగరాజు, చిట్టిపోలు శీను తదితరులు పాల్గొన్నారు.