జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రోహిత్ సింగ్

మిర్యాలగూడ సెప్టెంబర్ 17జనం సాక్షి : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆర్డీవో రోహిత్ సింగ్ ఆవిష్కరించారు. డి ఏ ఓ రాధా, డిటి హాజీ, జమాల్ తోపాటు సీనియర్ జర్నలిస్టులు, బిజెపి నాయకులు కర్నాటి ప్రభాకర్, బంటు సైదులు, సాధినేని శ్రీనివాస్ రావు, రమేష్, చిలుకూరి శ్యామ్, బంటుగిరి, తో పాటు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు , కమిషనర్ రవీందర్ సాగర్, కౌన్సిలర్లు మలగo, రమేష్ ఇలియాస్ ఖాన్, సానిటరీ ఎస్సై వెంకటరమణ, మున్సిపల్ అధికార, సిబ్బంది,
నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వజ్రం, గోవింద్ రెడ్డి, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మారం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో జాతీయ జెండాను ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కరరావు మాజీ ఎమ్మెల్యే జడ్పిటిసి, తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కార్యాలయ అధికార, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.