టిటిడి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

తిరుపతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): టిటిడి విద్యా విభాగం ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో బుధవారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి జెఈఓ పోలా భాస్కర్‌ హాజరయ్యారు. జెఈఓ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ.. టిటిడి పాఠశాలలో సదాచారం కార్యక్రమం ద్వారా ఎన్నో ఆధ్మాత్మిక, ధార్మిక, ఇతిహాసాలపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గురువులు సమాజానికి మార్గదర్శకులని వారిని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఈఓ పోలా భాస్కర్‌తో పాటు మహతి కళాక్షేత్రం సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

—————

తాజావార్తలు