10వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి: టీ ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్యోగులకు పదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీ ఉద్యోగ సంఘాలు నోటీసు ఇచ్చాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనలు తప్పవని స్పష్టం చేశాయి. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మిన్ని మాథ్యూని కలిసి ఐదు డిమాండ్లతో కూడిన లేఖను అందజేశారు.



