108-104 సేవలపై సీఎం కేసీఆర్ సమీక్ష

 2

హైదరాబాద్ : రాష్ట్రంలో 108,104 సర్వీసులను పటిష్ట పరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే విధంగా పోలీస్,వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య శాఖ, పోలీసు శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం : సీఎం కేసీఆర్
108,104 సేవలు, వాటి పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులతో సీఎం కేసీఆర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 108 వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని… ఉద్యోగుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ఉద్యోగులు,అధికారులతో మాట్లాడి వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు.
104 వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చర్యలు : సీఎం కేసీఆర్
నిర్ణీత తేదీల్లో గ్రామాలకు వెళ్లి వైద్య సేవలందించే 104 వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు,వైద్య శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంట ట్రామా సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వైద్య సేవలు మెరుగపడాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగపడాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు నగదు ప్రోత్సహం అందించేందుకు  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ పనిచేసే వైద్యులకు సమీప పట్టణంలో ఉండే వెసులుబాటు కల్పించాలని..అదే సమయంలో డాక్టర్లు కచ్చితంగా సమయపాలన పాటించి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో నాలుగు కొత్త ఆస్పత్రులు నిర్మాణానికి తగిన స్థలాల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందని సీఎం తెలిపారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని స్థలాల వివరాలను మంత్రి లక్ష్మారెడ్డి సీఎంకి తెలిపార