11న తిరుమలలో ఉగాది ఆస్థానం

తిరుమల, జనంసాక్షి: శ్రీవారి ఆలయంలో ఈనెల 11న ఉగాది ఆస్థానం జరగనుంది. శ్రీవిజయనామ సంవత్సరం సందర్భంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి చెంత ఆస్థానం, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఉగాది ఆస్థానం సందర్భంగా శ్రీవారికి తిరుప్పావడ, కల్యాణోత్సవం, వూంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవలను తితిదే రద్దు చేసింది. కాగా, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి 11 గంటలు వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపేసి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తాజావార్తలు