12న విడుదలవుతున్న కార్తీ విరుమన్‌

share on facebook

తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ’యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ’సుల్తాన్‌’ వరకు ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో కార్తీ సినిమాలకు ఇక్కడి టైర్‌2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్‌ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్‌లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్‌ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ’విరుమన్‌’ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగ్గజ దర్శకుడు శంకర్‌ కూతురు అధితి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.
లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్తి మాస్‌ ఫైట్‌లతో అదరగొట్టాడు. ప్రకాష్‌రాజ్‌కు వార్నింగ్‌ ఇచ్చే సీన్లు ఆకట్టుకుంటున్నాయి. సూరి కామెడీ పంచ్‌లు నవ్విస్తున్నాయి. కార్తి, అధితి మధ్య కెమెస్టీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంట్టంల్గªనమెంట్స్‌ పతాకంపై
సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఈ అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆగస్టు 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Other News

Comments are closed.