13 నుంచి జిల్లా మహాసభలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా మహాసభలను ఆసిఫాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షు కార్యదర్శులు చిరంజీవి, రాజులు తెలిపారు. ఈ నెల 13న నిర్వహించే మహాసభలకు సిపిఐ శాసన సభపక్ష నేత మల్లేష్‌ ముఖ్య అతిథిగా, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, ఇతర నాయకులు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ సంఘం నిర్వీర్యంగా పోరాడుతుందని ఆయన అన్నారు. తాము చేసిన పోరాటాల వల్ల ప్రభుత్వం దిగవచ్చి మెస్‌ ఛార్జీలు పెంచిందన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి 1500 రూపాయల మెస్‌ ఛార్జీలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 13న నిర్వహించే మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.