14న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటి సర్వసభ్య సమావేశం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11): జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ సర్వసభ్య సమావేశం ఈ నెల 14న ఉదయం 11 గంటలకు జరుగనుందని ఆ సోసైటీ కార్యదర్శి తులసీబాయి తెలిపారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సర్వసభ్య సమావేశం జరగనుందన్నారు. ఉప పోషకులు జీవిత సభ్యులు అందరూ హాజరు కావాలని కోరారు. సమావేశం తిలక్‌గార్డెన్‌లోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం వద్ద గల న్యూ అంబేద్కర్‌ భవన్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతుందన్నారు.  అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని, ఈ ఎన్నికలు కొత్త అమలులోకి వచ్చిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ నిబంధనల ప్రకారం జరుగుతాయన్నారు.