17న వికలాంగుల రాజ్యాధికార యాత్ర

అదిలాబాద్‌/ ఉట్నూరు: చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈనెల 17న జిల్లా ఇంచార్జీ బండపెల్లి రాజయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూరులో నిర్వహించి ఎమ్మార్పీఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో హామీచ్చి కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని దానిపై నిలదీయాల్సిన ప్రతిపక్ష తేదేపా నిర్లక్ష్యంతో మౌనం వహిస్తోందని విమర్శించారు. ఎమ్మార్పీఎస్‌ సంస్థాగత నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట సంఘం జిల్లా కన్వీనర్‌ ఓరుగంటి సత్యం, నాయకులు బిరుదుల లాజర్‌, బొమ్మెన సతీష్‌, జిల్లా పెల్లి దేవయ్య, రూబేన్‌, వినోద్‌ తదితరులున్నారు.