17,18 తేదీల్లో సీఆర్పీలకు శిక్షణ

సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యా హక్కు చట్టం అమలు, పాఠశాలల సందర్శన సమాచార సేకరణపై సీఆర్పీలకు ఈ నెల 18, 19 తేదీల్లో శిక్షణ సమావేశాలు నిర్వహింస్తున్నట్లు ఆర్వీఎం పీవో కె.సీతారామరావు తెలిపారు. 17న మెదక్‌, సంగారెడ్డి డివిజన్‌ సీఆర్పీలకు పాత బస్టాండ్‌ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, 18న సిద్దిపేట డివిజన్‌ సీఆర్పీలకు మండల రిసోర్సు కేంద్రంలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ నెల 22 నుంచి 31 తేదీ వరకు అన్ని పాఠశాలలను సందర్శించి సమాచార సేకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు.