2008కోట్లలో ప్రతిపైసాకు లెక్క ఉంది

– పచ్చదనం పెంపొందిస్తేనే భూతాపాన్ని తట్టుకోగలం
– నాటిన మొక్కల్లో ఎంతోకొంత బతికినా చాలు
– దేశవ్యాప్తంగా మొక్కల్లో తెలంగాణ 20శాతం నాటారని కేంద్రమే చెప్పంది
– ఇప్పటికైనా అడవుల విధ్వంసం ఆగాలి
– ప్రతిపక్షాలు రాజకీయ కోణాన్ని వీడి అడవులను కాపాడాలి
– సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు, వాటి పెంపకాన్ని చెపట్టేందుకు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 2008కోట్లలో ప్రతి పైసాకు లెక్క ఉందని, వారం రోజుల్లో నరేగా, క్యాంపాఫండ్స్‌ వివరాలను అసెంబ్లీ ముందు ఉంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో హరితహారంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సభలో పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి పలు విజ్ఞప్తుల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వస్తే ఎవరూ చేయగలిగింది లేదన్నారు. బాధ్యతగ ఉన్న ప్రభుత్వాలు బాధ్యతలను విస్మరించడం వల్లే విపత్తులు సంభవిస్తున్నాయని తెలిపారు. ముందు చూపు లేకనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నామని పేర్కొన్నారు. తాను సీఎం అయిన తర్వాత తొలి వారంలో పెట్టుకున్న అంశమే హరితహారమని చెప్పారు. దీనిపై అటవీశాఖ అధికారులతో నాలుగున్నర రోజులు చర్చించానని గుర్తు చేశారు. 2004 -14 కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పదేళ్లలో రూ. 130కోట్లు కేటాయించి ఖర్చు పెట్టిందని, తెరాస హయాంలో మూడున్నర ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం 2008 కోట్లు కేటాయించి, ఖర్చు చేసిందని ఈ లెక్కలతోనే ఎవరికి చిత్తశుద్ది ఏమిటలో అర్థమవుతోంది. స్వయంగా కేంద్ర పర్యావరణశాఖ మంత్రి హర్షవర్దన్‌ పార్లమెంట్‌లో దేశ వ్యాప్తంగా నాటిన మొక్కల్లో తెలంగాణాలోనే 20శాతం మొక్కలు నాటిందని ప్రకటించారన్నారు. భారతదేశ్‌ ఫార్టె స్ట్‌ డైరెక్టర్‌ జనరల్‌ దాస్‌ వచ్చి పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తీరును అభినందిచారని సీఎం గుర్తుచేశారు. సామాజిక అవసరాల కోసం అటవీభూములు సేకరించే క్రమంలో ప్రత్యామ్నాయ భూములు ఇచ్చే క్రమంలో కోల్పోయిన చెట్లు పెంచడానికి 1500 కోట్లు అలానే మురిగిపోతున్నాయన్నారు. సుప్రింకోర్టు కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు 40వేల కోట్ల మేర డబ్బు మూలుగుతున్నాయని సీఎం తెలిపారు.  ప్రధానమంత్రిని ఈ విషయమై మూడుసార్లు విన్నవించానని, ఆ బిల్లు వచ్చి పార్లమెంట్‌ లో పాస్‌ కావటానికే మూడేళ్లు పట్టిందన్నారు. పాసైన తరువాత మార్గదర్శకాలు రూపకల్పన జరగాలి.. ఆ గండం కూడా గట్టెక్కిందన్నారు. కానీ డబ్బుల విషయంలో ఫైనాన్ష్‌ మినిస్టర్‌, ఫారెస్ట్‌ మినిస్టర్‌కు తగాదా నడుస్తుంది.. మాకొచ్చి పోవాలని ఫైనాన్స్‌.. మేము అలా ఇవ్వలేమని ఫారెస్ట్‌ ఇలా పంచాయితీ వాయిదా పడిందన్నారు. కానీ నేను మా పర్సంటేజ్‌ ఇవ్వాలని కోరామన్నారు. ఖమ్మం జిల్లాలోని గోదావరి బెల్ట్‌ లో, ఆదిలాబాద్‌ జిల్లాలో అడవి తప్ప అడవిలేదు.. ఆటవీ సంపద మళ్లీ పెరగాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇటీవల భూపాలపల్లిలో ఘటన జరిగింది.. దానిపై రాద్దాంతం చేశారు.. ఆ గొత్తికోయలు మన రాష్ట్రం వారు కాదు.. నిరంతరం వారు రావటం అటవీ భూములు నరకడం.. దీనికి లెఫ్ట్‌ పార్టీ వారు జెండాలతో వారికి మద్దతు పలకడం.. ఇదే రీతిలో అడవులు నరుక్కుంటూ పోతే అడవులు ఉంటాయా..? అని సీఎం ప్రశ్నించారు. గుత్తి కోయలను అడవులు నరకనిద్దామా? అని సీఎం ప్రశ్నించారు. గుత్తి కోయలు మన రాష్టాన్రికి చెందిన వారు కాదన్నారు. రకరకాల కారణాలతో విచక్షణారహితంగా అడవులను నరుకుతుంటే చూస్తూ ఊరుకుందామా? అని అడిగారు. అడవులను నరికి వ్యవసాయం చేయడం తప్ప వేరే జీవనోపాధి లేదా అని ప్రశ్నించారు. అడవులు నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పామని సీఎం అని గుర్తు చేశారు. 2008కోట్ల ఖర్చులో కేంద్ర ప్రభుత్వం అనుమతి మేర 1300 కోట్లతో నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. 2014-15లో 4,149 నర్సరీలు ఏర్పాటు చేశాం 2015, 2016 లో 3,500 నర్సరీలు పెట్టామని, ప్రస్తుతం 2009 నర్సరీలు ఉన్నాయన్నారు. 1980 నుంచి 2014 వరకు 34సంవత్సరాల కాలంలో తెలంగాణ పది జిల్లాలో 3.7కోట్లు మొక్కలు నాటారని తెలిపిన సీఎం మూడేళ్ల తెలంగాణ పాలనలో 81కోట్ల మొక్కలు అటవీశాఖ ఆధ్వర్యంలో
మొక్కలు నాటడం జరిగిందన్నారు. 5100 కి.విూ రెవెన్యూ ప్లాంటేషన్‌ చేశామని,  3001 ట్యాంకర్లు పెట్టామని, తద్వారా 90శాతం పని జరుగుతుంది అని అటవీశాఖ మంత్రి తెలిపితే ప్రతిపక్షాలు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊళ్లలో కోతల బెడద ఎక్కువ కావటానికి అడవులు అంతరించి పోతుండటమే కారమని సీఎం తెలిపారు. గతంలో అడవుల్లో పండ్ల మొక్కల చెట్లు ఉండటంతో కోతులకు అడవుల్లోనే ఆహారం దొరికేదని, ప్రస్తుతం అడవులు అంతరించిపోతుండటంతో అవి ఆహారం కోసం మన కిచెన్‌లోకి వస్తున్నాయన్నారు. గతంలో నేను ఓ పాటలో ‘వర్షాలు రావాలే.. కోతులు వాపస్‌ పోవాలె’ అంటూ రాశానని సీఎం తెలిపారు. ఈ పరిస్థితి రావాలంటే విస్తారంగా అడవుల్లో అన్ని రకాల మొక్కలు నాటాలన్నారు.
అటవీశాఖలో ఖాళీలను భర్తీ చేస్తాం..
అటవీశాఖలో 50శాతం ఉద్యోగాలు ఖాళీలు ఉన్న మాట వాస్తవమే అనని సీఎం పేర్కొన్నారు. వాటి భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే 2085 ఉద్యోగాలకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని, త్వరలో భర్తీకి చర్యలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో అటవీశాఖ అధికారులకు 237 వాహనాలు ఉంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 2143 వాహనాలు అందించామన్నారు. కొన్ని రకాల పండ్ల మొక్కలు మాత్రమే ప్రయివేటు నర్సరీల్లో కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. హరితహారంపై అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటి వరకు 4 కోట్ల 54 లక్షల మొక్కలు నాటామని గుర్తు చేశారు. మొక్కలను రక్షించడంలో భాగంగా అగ్నిమాపక సిబ్బందికి కూడా బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ రావి, వేప చెట్లు పెంచుతున్నామని చెప్పారు.
అన్యాక్రాంతమైన అటవీ భూములు వెనక్కి రావాలి…
/ూష్ట్రంలో అన్యాక్రాంతమైన అటవీ భూములన్నీ వెనక్కి రావాలని సీఎం తెలిపారు. మెదక్‌ నుంచి సిద్ధిపేట వచ్చే దారిలో భయంకరమైన అడవి ఉండేదన్నారు. అప్పటి అడవి మాయం కావడానికి కారణం ఎవరు? అని సీఎం ప్రశ్నించారు. గత పదేండ్ల కాలంలో కాంగ్రెస్‌ అడవుల సంరక్షణ కోసం రూ. 130 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. తాము ఖర్చు చేసిన రూ. 2008 కోట్లలో ప్రతి పైసకు లెక్క ఉందన్నారు. వారం లోగా నరేగా, క్యాంపా ఫండ్స్‌ వివరాలు సభ ముందు పెడుతానని సీఎం స్పష్టం చేశారు. వరంగల్‌ అడవి గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో గమనించండి అని సూచించారు. కోల్పోయిన అటవీసంపద పునరుజ్జీవం పొందాలన్నారు. గోదారి పరీవాహక ప్రాంతం, ఆదిలాబాద్‌ తప్ప ఎక్కడా అడవులు లేని దుస్థితి నెలకొని ఉందన్నారు. 24 శాతం అడవి కాగితాల్లేనే ఉందన్నారు. భూమి విూద లేదన్నారు.
సికింద్రాబాద్‌లో మొక్కలు నాటేందుకు స్థలం లేదు…
హరితహారం సికింద్రాబాద్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతలు తనకే ఇచ్చారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో మొక్కలు నాటే స్థలం లేకుండా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఈ రోజుకు డిగ్రీ కళాశాల లేదన్నారు. సికింద్రాబాద్‌లో విద్యాసంస్థలు నెలకొల్పుదామన్న.. మొక్కలు నాటుదామన్నా స్థలాలు లేవు అని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి నెలకొని ఉందన్నారు.