26న కేసీఆర్‌ ఇంటిని ముట్టడిస్తాం :తెలంగాణ విద్యార్థి ఐకాస (స్వతంత్ర)

హైదరాబాద్‌: తెలంగాణపై విస్తృతంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత సమయంలో మౌనం వీడకుంటే ఈనెల 26న తెరాస అధినేత కేసీఆర్‌ ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ విద్యార్థి ఐకాస (స్వతంత్ర) హెచ్చరించింది.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, కేసీఆర్‌ మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించింది. ఐకాస కన్వీనర్‌ చారగొండ వెంకటేశ్‌ బుధవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు.