29న ఐఐఎం చెన్నై క్యాంపస్‌ ప్రవేశ పరీక్ష

చెన్నై:ప్రతిష్ఠాత్మక విద్యాసంస్ధ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)తిరుచ్చి తన చెన్నై క్యాంపస్‌కు సంబందించిన వివరాలను ప్రకటించింది.గత ఏడాది తిరుచ్చిలో రెగ్యులర్‌ కోర్సులను ప్రారంబించాగా ఈ సంవత్సరం నుంచి చెన్నైలోనూ ఈ కోర్సులను మొదలు పెట్టనున్నట్లు ఐఐఎం తిరుచ్చిడీస్‌ ప్రొఫెసర్‌ జి.సేథు పేర్కొన్నారు.శుక్రవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ల కోసం ప్రత్యేకంగా చెన్నై క్యాంపస్‌లో తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు.మూడేళ్ల వ్యవధి గల ఈ కోర్సు తరగతులు పూర్తిగా సాయంత్రం సమయంలోనే ఉంటాయి.మూడేళ్ల ఫీజు రూ.10లక్షలని పేర్కొన్నారు.ఇందుకు సంబందించిన ప్రవేశపరీక్ష ఈనెల 29న జరుగుతుంది.