29న ఛలో హైదరాబాద్‌ విద్యార్థి జేఏసీ పిలుపు..

హైదరాబాద్‌, జనంసాక్షి :

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనవరి 29న చేపట్టనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేత పి. రవి ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సానుకూల ప్రకటన చేయకుంటే పాలనను స్తంభిం పజేస్తామని హెచ్చరించారు. 30 రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్క రిస్తామని ప్రకటించి ఆ తర్వాత మాట మార్చడం తగదని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి

ఉండకుంటే గడువు ముగిసిన మరుసటి రోజు నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అలాగే జనవరి 7 నుంచి 21వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని, జనవరి 24న వరంగల్‌ జిల్లా మహబూబా బాద్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.