2/9/22 photo రెడ్డి స్ట్రీట్ వినాయక మండపం వద్ద మహా అన్న దానం
రెడ్డి స్ట్రీట్ వినాయక మండపం వద్ద మహా అన్న దానం
జనగామ( జనం సాక్షి)సెప్టెంబర్2: రెడ్డి స్ట్రీట్ రిలయన్స్ టవర్ సమీపం నందు గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా గణేష్ మండపం నందు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనైనది.గణేష్ నవరాత్రోత్సవాల కమిటీ సభ్యులు అయిన జైన రమేష్ సంధ్యారాణి కుమార్తే జైన శృతిక పుట్టిన రోజు వేడుకలను గణేష్ మండపం నందు అన్నదానం తో ఘనం గా నిర్వహించుకుంది.సుమారు 400 మంది కి అన్నధానం చేయనైనది.ఈ అన్నదాన కార్యక్రమం ను గౌరవ లెఫ్టనెంట్ కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి గారు ప్రారంబం చేసారు. వారు మాట్లాడుతూ అన్ని దానలకన్నా అన్నదానం గొప్పది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజం నందు సంఘటిత శక్తి ఏర్పడుతుంది అని అన్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపు కుంటున్న శృతిక కు ఆశీస్సులు అందచేశారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు వార్డ్ కౌన్సిలర్ మహంకాళి హరిచందర్ గుప్తా, చారబుడ్ల సురేందర్ రెడ్డి,ఈ రోజు అన్నదాన దాత జైన రమేష్, సంధ్యారాణి, యాదగిరి, బాలమణి, శృతికానందన్, మోకు లతా ఉపేందర్ రెడ్డి,చింతల తిరుమల లక్ష్మణ్,మార్గం విజయా రవి,సురేష్ రెడ్డి, పూలమ్మ, లక్కీ, సన్నీ, చెర్రీ అఖిల్, పప్పు,శ్రీనివాస్, రేణుక, తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు…