3గంటలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం ఇవాళ సమావేశం కానుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆ పార్టీ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో కార్యవర్గ సభ్యులు భేటి అయి పార్టీ భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నారు. తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంభిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ఎండగట్టే అంశంతో పాటు ఉద్యమాన్ని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే అంశాలపై చర్చ జరుగనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

తాజావార్తలు