30 మంది బాల కార్మికులకు విముక్తి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు దాకాణాలు, ప్రధాన చౌరస్తాలలో పలు స్వచ్ఛంద సంస్థలు దాడులు నిర్వహించి బాల కార్మికులకు విముక్తి కలిగించారు. ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు దుకాణాలపై నిర్వాహకులు పోలీసుల సహకారంతో దాడులు చేశారు. ఈ సందర్భంగా బాల కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయరహదారి వెంటు భిక్షాటన చేస్తున్న చిన్నారులను వారు పట్టుకున్నారు. దాదాపు 30 మంది బాలలను పోలీసులకు అప్పగించారు. బాల కార్మికులకు ప్రభుత్వం నపుంచి అందాల్సిన సౌకర్యాలను అందేవిధంగా కృషి చేస్తామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చెప్పారు. బాలలతో పని చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని కార్మిక శాఖ అధికారలు చెప్పారు.