31న రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ రాతపరీక్ష

హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం అనంతరం ఎక్సైజ్‌ శాఖలో చేపడుతున్న కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 31న రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2604 పోస్టులకు 75వేల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వంద మార్కులతో జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రం రూపొందించింది. ఈ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు చోటులేకుండా ప్రభుత్వం జిల్లా సెలక్షన్‌ కమిటీలను ఏర్పాటుచేసింది. ఇందులో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌, కన్వీనర్‌గా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌, సభ్యుడిగా ఎస్పీలు ఉన్నారు. కాగా, దళారులను నమ్మిమోసపోవద్దని ఎక్సైజ్‌ అధికారులు సూచిస్తున్నారు.