33వేల రూపాయల అంచుకు చేరుకన్న బంగారం ధర

హైదరాబాద్‌: సరికొత్త రికార్డుల దిశగా పుత్తడి పరుగులు తీస్తోంది. సరిగ్గా ఏడాది కిందట 22వేల రూపాయలున్న బంగారం ఇప్పుడు 33వేల రూపాయల అంచుకు చేరుకుంది. అదే దిశగా వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం నగర మార్కెట్‌లో వీటి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 32,820. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.31650, కిలో వెండి ధర రూ.64900 పలికింది.