408 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌

మొహాలీ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 408 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిని ఆసీన్‌ మరో 135 పరుగులను జోడించింది. స్టార్క్‌ 99, స్మిత్‌ 92, కొవాన్‌ 86, మరో వార్నర్‌ 71 పరుగులు చేయగా మిగతా బ్యాట్స్‌మెన్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శర్మ 3, జడేజా 3 వికెట్లు తీయగా.. అశ్విన్‌, ఓజా తలో రెండు వికెట్లు తీశారు. వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు ఆట రద్దైన విషయం తెలిసిందే.