50 ఏళ్ల రాజకీయ జీవితం సంతృప్తికరంగాసాగింది.: అద్వానీ

తిరుమల: రాజకీయం వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ అన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం సంతృప్తికరంగా సాగిందని ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తప జన్మదినం సందర్భంగా హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి పర్యటనలో భాగంగా శ్రీహరికోటలో తనిఖీలకు హాజరుకాలేకపోయానని అన్నారు. రాష్ట్రపతితోపాటు పలువురు ప్రముఖులు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. అనంతరం తిరుమల భద్రతా వ్యవహారాలపై తిరుపతిలో జరిగే అధికారుల సమావేశానికి అద్వానీ బయలుదేరి వెళ్లారు.