50 శాతం సబ్సిడీతో పాడి రైతులకు బర్రెలు’

ప్రైవేట్‌కు దీటుగా విజయడైరీని తీర్చిదిద్దుతాం

అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి) : 50 శాతం సబ్సిడీతో రూ. 600 కోట్లతో వ్యయంతో పాడి రైతులకు

బర్రెలు కొనిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పాడి పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ రూ. 170 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రంలో కొత్త డెయిరీ ఎలాంట్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. సన్న, చిన్నకారు రైతులు పాడివిూద ఆధారపడ్డ వారు లక్షల మంది ఉన్నారు. తెరాస హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు. పాడి గేదెలకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించటం జరిగిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ డిమాండ్‌కు 8లక్షల వరకు మెగాడైరీని తీసుకొస్తున్నం.. తరువాత షావిూర్‌పేట ప్రాంతంలో 100 ఎకరాల భూమి తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో విజయడైరీకి మించిన డైరీ ఏదీ లేదన్న రీతిలో డైరీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో లాగా కాకుండా ప్రైవేట్‌ డైరీల కంటే ధీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామనారు. రాబోయే రోజుల్లో పాడి రైతులుకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముల్కనూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా పాడి రైతులకు రూ. 4 ఇన్సెంటివ్‌ అందిస్తున్నట్లు చెప్పారు.