550 కేజీల నల్లబెల్లం స్వాధీనం
పుల్లలచెరువు : ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఎం. ఎర్రబాలెం గ్రామంలో నాటు సరా తయారీ కోసం తీసుకువస్తున్న నల్ల బెల్లాన్ని ఎక్స్తెజ్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. కురిచేడు నుంచి ఎర్రబాలెం గ్రామానికి ఆటోలో 550 కేజీల నల్లబెల్లాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మార్కాపురం ఎన్‌ఫోర్స్‌మోంట్ సీఐ నరహరి తెలిపారు.



