హక్కులడిగిన కేసీఆర్ మరో కేజ్రీవాలట
– విభజన తమ పరిధిలోదికాదట
– మీరే తేల్చుకోవాలి
– సదానంద గౌడ సంబంధంలేని వ్యాఖ్యలు
న్యూఢిల్లీ,జూన్ 28(జనంసాక్షి): హైకోర్టు విభజనపై తెలంగాణలో లాయర్లు ఆందోళన చేస్తుంటే, సమస్య తీవ్రతను పట్టించుకోవాలని చెబుతుంటే కేంద్రం దీనిని ఓ జోక్‌గా తీసఓ|్5హకుంది. తన చేతిలో లేదంటూ చేతులెత్తేసింది. స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ దీనిపై బాధ్యతా రహితంగా సమాధానం ఇచ్చి, విూరువిూరు తేల్చుకోండని కొట్టి పారేశారు. తాను కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేనంటూ సమాధానం ఇచ్చారు. అంతేగాకుండా హైకోర్టు విభజనపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలనే ఆయన సీరియస్‌గా తీసుకుంటూ మరో కేజ్రీవల్ కావాలనుకుంటే చేసేదేవిూ లేదని పెడసరం సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు ఆశ్చర్యాన్ని కలిగించాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. జంతర్‌మంతర్ వద్ద ఆయన ధర్నా చేయదలచుకుంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. కేజీవ్రాల్‌లా కేంద్రాన్ని విమర్శిస్తూ ధర్నాలు చేస్తే ప్రజలే ఆయనకు సమాధానం చెబుతారని అన్నారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల సస్పెన్షన్ వ్యవహారాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం సదానండగౌడను కలిసి వివరించారు. హైకోర్టు విభజన అంశం ఉమ్మడి హైకోర్టులో ఉన్నందున తానేవిూ వ్యాఖ్యానించలేనని సదానందగౌడ స్పష్టం చేశారు. ఈ అంశంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదన్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. హైకోర్టు విభజనపై పలు దఫాలుగా రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పరిణామాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రెండు రాష్ట్రాల గవర్నర్లకు లేఖ రాస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాల నిర్ణయంతోనే హైకోర్టు విభజన జరగాలని సదానందగౌడ తేల్చారు. కేసీఆర్ కేంద్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రాల నిర్ణయాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఏవిూ చేయకపోయినా… ప్రతిరోజు కేజీవ్రాల్ కేంద్రాన్ని నిందిస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం అలా చేస్తానంటే ప్రజలే తగిన జవాబు ఇస్తారన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని చదవాలని, కేంద్రంపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37వరకూ ఆమోదం ఉందని సదానంద గౌడ తెలిపారు. అలాగే తెలంగాణ హైకోర్టులో 24మంది వరకూ న్యాయమూర్తులకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 18మంది న్యాయమూర్తులు ఏపీకి చెందినవారు, మరో ముగ్గురు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారన్నారు. ఈ వివరాలతో తాము విభేదించడం లేదన్నారు. కాని దిగువ కోర్టులతో సంబంధించినంత వరకూ ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోనే నియామకం అవుతారన్నారు. జడ్జిల నియామకాలకు సంబంధించి ప్రాథమిక విధానం ఇలా ఉంటుందని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి పెడతారని సదానంద గౌడ అన్నారు. పునర్ విభజన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ, తెలంగాణ వ్యవహారలను చూస్తారని, అయితే తెలంగాణ రాష్ట్ర సీఎం కేంద్రాన్ని నిందించడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. హైకోర్టు విభజనకు కేంద్రం ఎలాంటి చొరవ చూపలేదనడం సరికాదని సదానంద గౌడ అన్నారు. రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాలను ఓసారి పరిశీలించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై మూడు,నాలుగుసార్లు తెలంగాణ
ఎంపీలు తనను కలిశారని, ఇద్దరు ముఖ్యమంత్రులతో పలుమార్లు మాట్లాడినట్లు సదానంద తెలిపారు. రాష్ట్ర హైకోర్టు విభజన కోసం తాము చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు. హైకోర్టు విభజనపై ఇదివరకే పిల్ దాఖలైందని, ఆ పిల్‌ను పరిష్కరించారని, తర్వాత రివ్యూ పిటిషన్ కూడా దాఖలైందన్నారు. ప్రస్తుతం ఆ పిటిషన్ ఉమ్మడి హైకోర్టు ముందుందన్నారు. ఇప్పుడు హైకోర్టు విభజనపై ఏం మాట్లాడినా అది కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా తాను కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని సదానంద గౌడ స్పష్టం చేశారు. ఇది తన దృష్టికి వచ్చినా, మిగతా అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఈ విషయాలన్నీ లేఖ రూపంలో రాసినట్లు ఆయన తెలిపారు. అలాగే గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్ల పరిధిలో అంశాలు ఉన్నాయని సదానంద తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టు విభజన అంశంలో మాట్లాడటం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. ఈ విషయం విూడియాకు బాగా తెలుసునని సదానంద గౌడ వ్యాఖ్యానించారు.
సదానంద వ్యాఖ్యలపై లాయర్ల మండిపాటు
కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడపై తెలంగాణ న్యాయవాదులు ఫైర్ అయ్యారు. హైకోర్టు విభజన విషయంలో కేంద్రం మరోసారి నిర్లక్ష వైఖరిని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన సమస్యను తేల్చకుండా నాన్చుతుందని దుయ్యబట్టారు. ఆంధ్రా హైకోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలంగాణ సర్కారు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. హైకోర్టు విభజనను ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పుకోకపోతే పదేళ్లపాటు కేంద్రం ఇలాంటి అన్యాయాన్నే కొనసాగిస్తుందా? అని ప్రశ్నించారు.విభజన చట్టం గురించి తెలయికుంటే కాపీ పంపుతామని దానిని చదువుకోవాలన్నారు. ఇలాంటి కేంద్ర మంత్రి న్యాయశాఖకు ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఇదిలావుంటే తెలంగాణ న్యాయవాదుల విధులకు ఆటంకం కల్పిస్తూ.. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కవిూషన్‌లోలో మంగళవారం తెలంగాణ అడ్వకేట్ జాక్ ఫిర్యాదు చేసింది.అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసులపై చర్య తీసుకోవాలని కోరారు.