మీనా టిఫిన్ సెంటర్లో గృహ సిలిండర్ల వాడకం

ఆర్మూర్,మే 23(జనంసాక్షి): సామాన్యుడికి కొరతగా లభిస్తున్న గృహ సిలిండర్లు టిఫిన్ సెంటర్లు,హోటళ్లు,రెస్టారెంట్లలో అవే సిలిండర్లు దర్శనమిస్తున్నాయి.గృహ అవసరాల కోసం కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను టిఫిన్ సెంటర్లు,హోటళ్లలో వాడటాన్ని అధికారులు నిషేధించారు.వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉన్న చట్ట విరుద్ధంగా ఆర్మూర్ పట్టణంలోని కమల నెహ్రూ కాలనీలో కెనాల్ కట్టను సమీపంలో ఉన్న మీనా టిఫిన్ సెంటర్ లో ఉపయోగిస్తున్నారు.నిబంధనలు ఉల్లంఘిస్తే సిలిండర్లను స్వాధీనం చేసుకోవడం, జరిమామానాలు విధిస్తారని తెలిసిన ఇదే తంతు కొనసాగిస్తున్నారు.కమర్షియల్ సిలిండర్ల ధరలు ఎక్కువగా ఉండడం,నిత్యవసర ధరల పెంపుతో వ్యాపారులు తక్కువ ధరకు లభించే డొమెస్టిక్ సిలిండర్లపై ఆధారపడుతున్నారు.నిత్యవసర ధరల పెంపులకు అనుగుణంగా టిఫిన్ రేట్ల ధరలు పెంచి వినియోగదారులకు షాక్ ఇస్తున్న వాణిజ్య వ్యాపారులు ఏమాత్రం నిబంధనలు పాటిస్తున్నారో ఆలోచన జరపాలి. మున్సిపల్ అధికారులు తనిఖీల లోపంతోనే వాణిజ్య వ్యాపారులు యదేచ్చగా గృహ అవసరాల సిలిండర్లను వాడుతున్నట్లు తెలుస్తుంది.మరి చట్ట విరుద్ధంగా గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాడుతున్న వాణిజ్య వ్యాపారులపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్మూర్ ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు