అభివృద్ది దిశగా పరిణామాల మార్పు

దేశంలో బహుశా ఈ మధ్యకాలంలో కేంద్రంలో మోడీ కన్నా కూడా ఇరు తెలుగు రాష్టాల్ల్రో పోటీ పెరిగింది. ఐటి, సాగునీటి రంగం, పారిశ్రామిక రంగాల్లో పోటీ పెరిగింది. బహుశా గతంలో ఎప్పుడూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇంతగా అభివృద్ది సాధించిన దాఖలాలు లేవు. ఇది ఓ రకంగా తెలుగు ప్రాంతాలకు శుభసూచకంగానే భావించాలి.దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం ఎలా ఉండాలన్న ప్రణాళికతో ఇరు రాష్టాల్రు ముందుకు సాగుతున్నాయి. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా అబివృద్ది నినాదంలో ఇద్దరు సిఎంలు చంద్రబాబు, కెసిఆర్‌లు పనిచేస్తున్న తీరు అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆకట్టుకుంటోంది.  తెలంగాణలో సత్వర పారిశ్రామికాభివృద్ధికి బాటలుపరిచేలా సరికొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకుతీసుకొచ్చింది. పరిశ్రమల అనుమతి ప్రకియను సరిళీకరించింది. పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతుల జారీలో పారదర్శకత, జాప్యం నివారణ, సంబంధిత సంస్థలు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యహరించేలా కాలవ్యవధితో కూడిన కట్టుదిట్టమైన నిబంధనలను ప్రతిపాదించింది.  అదే సమయంలో పారిశ్రామికవేత్తలూ నిబంధనలకు బద్ధులయ్యేలా పలు జాగ్రత్తలు తీసుకొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం- టీఎస్‌ఐపాస్పభ్రుత్వం అమలు చేస్తోంది. తెలంగాణ ఐటిరంగ అభివృద్దికి ఇప్పుడు మంత్రి కెటి రామారావు కేంద్ర బిందువుగా మారారు. దేశ విదేశాల్లో ఆయన పేరు ఇప్పుడు మర్మోగుతోంది. ఐటిరంగ అభివృద్దికి ఆయన చేస్తున్న కషి కారణంగా 75వేల కోట్ల ఆర్డర్లు వచ్చాయని ఇటీవల ఐటి పాలసీ విడుదల సందర్భంగా వెల్లలడించారు. స్టార్టప్‌ కంపెనీలుపెట్టడం, పెట్టుబడులను ఆకర్శించడం తద్వరా నిరుద్యోగ సమస్య పరిస్కారానికి దోహద పడుతున్నాయి. ఎపిలో కూడా సిఎం చంద్రబాబు  కారణంగా అవకాశాలు ఉన్నా ఎందుకనో రాజధాని లేకపోవడం వల్ల కావచ్చు లేదా మరే ఇతర కారణాల వల్లనో ఐటి అంతగా పుంజుకోలేదు. అమరావతి నిర్మాణం జరిగితే రూపురేఖలు మారుతాయని అంటున్నారు. . కానీ అనూహ్యంగా తెలంగాలో ఐటి శాఖ మంత్రి కెటి రామారావు నిరంతరంగా ఈ రంగంపై దృష్టి పెట్టారు. వివిధ రంగాల పెద్దలను కలుసుకుని వారి సూచనలు,సలహాల మేరకు ఐటి పాలసీని తీసుకుని వచ్చారు. టాటా, రిలయన్స్‌, గూగుల్‌, మైక్రోసాప్ట్‌, టెక్‌ మహింద్ర లాంటి కంపెనీల అధిపతులు ఇక్కడికి వచ్చి ఐటి పాలసీని అభినందించాయి. స్టార్టప్‌ కంపెనీలకు నీరు పోశారు. ప్రత్యేకచొరవ కారణంగా ఒక్కసారిగా ఐటి రంగం దూసుకుని పోయే స్థితికి వచ్చింది. ఇదో రకంగా నిరుద్యోగులకు వరం కానుంది. బెంగుళూరు స్థాయిలో ఐటి విస్తరణకు అవకాశాలు వచ్చాయి. తాజాగా టాటా ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ విడిభాగాల పరిశ్రమకు శంకుస్థాపన ఇటీవలే జరిగింది. రోణ రంగంలో ఇదో కీలకమైన మలుపు అని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. అయితే తెలంగాణతో పాటు ఎపిలోనూ ఐటి విస్తరణకు బాబు విశేషంగా కృషి చేస్తున్నారు. అమరావతి వస్తే దీన్ని  కేంద్రంగా చేసుకుని ఐటి విస్తరణ జరగవచ్చని అంటున్నారు. ఎపిలోనూ చంద్రబాబు తనకున్న బ్రాండ్‌ ఇమేజ్‌తో ముందుకు సాగుతున్నారు. విశాఖలో ఐటి విస్తరణ చురుకుగా సాగుతోంది. ఎపిలో కూడా ప్రత్యేకంగా పెట్టుబడులకు ఐటి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అమరావతి నిర్మాణం జరిగితే ఎపి రాజధాని అమరావతి కూడా ఐటికి అడ్రస్‌గా మారనుంది. విభజన తరవాత పారిశ్రామిక అభివృద్ది, ఉద్యోగాల కల్పనలో ఇరు రాష్టాల్ర సిఎంలు పోటీ పడి పనులు చేపడుతున్నారు. అలాగే అభివృద్ది కోసం పరుగులు తీస్తున్నారు. రానున్న రెండుమూడేళ్లలో ఇరు తెలుగు రాష్టాల్ల్రో ఐటి రంగం భారీగా విస్తరించనుందన్న సమాచారంఅభివృద్దికి సంకేతంగా భావించాలి.  రాష్ట్ర విభబజనకు ముందు,తరవాత స్తబ్దత ఆవరించడంతో పాటు ఈ రంగం విస్తరణపై నీలినీడలు కమ్మకున్నాయి ప్రధానంగా శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించడం, నిరంతర విద్యుత్‌ వంటి అంశాలు కూడా ఐటి విస్తరణకు అవకాశాలను ఇనుమడింప చేశాయి. అలాగే  ఇరు రాష్టాల్ల్రో పారిశ్రామిక ప్రగతి వచ్చే మూడు నాలుగేళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే వీలుంది. తెలంగాణలో పారిశ్రామికాభి వృద్ధికి, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం, పరిశ్రమలకు అనుమతులు ఒకే చోట మంజూరు చేసి, వాణిజ్య ఉత్పత్తులను వెంటనే ప్రారంభించేలా చేయడం వల్ల పారిశ్రామికవేత్తలు హ్యాపీగా ఉన్నారు. పారిశ్రామికవేత్తలకు సులువుగా అనుమతులు వస్తాయి. ఎపిలో పెట్టుబడులకు ఇప్పటికే చంద్రబాబు  విదేశీ పర్యటనలు చేపట్టారు. పిలో కూడా పెట్టుబడులు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. ఒక్క దరఖాస్తు చేసుకొని వెళ్లిపోతే మొత్తం అనుమతుల పక్రియకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని, పారిశ్రామికవేత్తల ఇంటికి వాటిని పంపిస్తామని  సిఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచదేశాలతో పోల్చితే భారత్‌లో పెట్టుబడులే లాభదాయకంగా ఉంటాయి. అందునా ఆంధ్రప్రదేశ్‌లో పెడితే మరింత లాభదాయకంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకేతాలు పంపారు.  ఓడరేవుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తూ కారిడార్‌ అభివృద్దికి శ్రీకరాం చుట్టారు. మొత్తంగా ఉపాధి కల్పనేలక్ష్యంగా ఐటి, పారిశ్రామిక విస్తరనకు గల అవకాశాలను మెరుగు పరుస్తున్నారు.