పకోడీలమ్ముడుకాదా!..

మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదే
` ప్రధాని మోదీ
దిల్లీ(జనంసాక్షి): దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడోవిడత అధికారంలోకి వచ్చాక భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని హావిూ ఇచ్చారు.దిల్లీలోని భారత మండపంలో ‘స్టార్టప్‌ మహాకుంభ్‌’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.’’1.25 లక్షల స్టార్టప్‌లు, 110 యూనికార్న్‌లతో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా అవతరించింది. సరైన సమయంలో కచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాం. దేశ యువత స్టార్టప్‌ల ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టి పెట్టుబడులను ఆకర్షించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగారు. దేశంలో 45 శాతం స్టార్టప్‌లను నడిపిస్తున్నది మహిళలే. మధ్యంతర బడ్జెట్‌లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోటి బడ్జెట్‌ కేటాయించడం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం’’ అని ప్రధాని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని రాజకీయాల్లో స్టార్టప్‌లపై ఛలోక్తులు విసిరారు. ‘’చాలా మంది స్టార్టప్‌లను ప్రారంభిస్తారు. రాజకీయాల్లో ఇవి ఎక్కువ. ప్రతిసారీ కొత్త స్టార్టప్‌లు ప్రారంభించాల్సిందే. కానీ, విూ స్టార్టప్‌లకు రాజకీయాల్లో వాటికి చాలా వ్యత్యాసం ఉంది. విూరు ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తారు. ఒక ఆలోచన కార్యరూపం దాల్చకుంటే మరో ఐడియాతో ముందుకు సాగుతారు’’ అని మోదీ పేర్కొన్నారు.

 

తాజావార్తలు