బ్యాంకులో కొదువ పెట్టిన బంగారం మాయం!

ఆర్మూర్ : ఓ ప్రైవేట్ బ్యాంకులో ఖాతాదారు బంగారం లోన్ విడిపించేందుకు బ్యాంకుకు వెళ్లగా సదరు బ్యాంకు వారు ఆ బంగారాన్ని విడిపించుకున్నట్లు తెలిసి ఖాతాదారు ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఖాతాదారు లేకుండానే బంగారం విడిపించడంపై ఖాతాదారు బ్యాంక్ మేనేజర్ పై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపుతుంది.వివరాల్లోకి వెళ్తే కమ్మర్ పల్లి మండలం కోన సముందర్ గ్రామానికి చెందిన దాత్రిక ప్రసన్న గత సంవత్సరం 9వ నెల 2023న 12 తులాల నాలుగు గ్రాముల బంగారాన్ని ప్రైవేట్ బ్యాంకులో లోన్ పెట్టి నాలుగు లక్షల 86వేల 500 రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇటీవల ఖాతాదారు వడ్డీతో సహా చెల్లించి బ్యాంకులో లోన్ విడిపించేందుకు వెళ్ళగా లోన్ ను ముందే క్లోజ్ చేసుకున్నారని చెప్పడం గమనార్హం.పూర్తి వివరాలు భాదితురాలు ఆరా తీయగా అదే నెలలో నా ప్రమేయం లేకుండా గొడవల కారణంగా దూరంగా ఉంటున్న భర్త ప్రవీణ్ నా సంతకాన్ని ఫోర్జరీ చేసి బంగారాన్ని విడిపించుకున్నట్లు తెలిపింది.బంగారం తనఖా పెట్టిన ఖాతాదారుకు కాకుండా తన భర్తకు బంగారం అప్పగించడం పై బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని బాధితురాలు వాపోయింది.బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం తిరిగి అప్పగించాలని , బ్యాంకు
మేనేజర్ పై తగు చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పోలీసు స్టేషన్ లో బాధితురాలు పిర్యాదు చేసింది.

ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకుల కంటే ఇంకా అచితుచిగా ప్రైవేట్ బ్యాంకులు అనుసరిస్తాయి. బ్యాంకు వారు లోన్ కుదువపెట్టిన ఖాతాదారు, లోన్ రశీదు ఉంటే తప్ప లోన్ విడిపించేందుకు ఆస్కారం లేదు.ఒకవేళ లోన్ రశిదు పోతే తన పేరు మీద అఫిడవిట్ బ్యాంకు వారికి సమర్పిస్తే ఖాతాదారు లోన్ విడిపించుకునెందకు వీలు ఉంటుంది అయినప్పటికీ ఖాతాదారు తప్పనిసరి అని సమాచారం.బ్యాంకు నిబంధనలు ప్రకారం ఖాతాదారుకి మాత్రమే లోన్ విడిపించుకునే సదుపాయం ఉంటుంది. ఖాతాదారు చనిపోతే మాత్రమే నామిని లోన్ ను వడ్డీతో సహ చెల్లించి తిరిగి బంగారాన్ని పొందవచ్చు. ఖాతాదారు లేకుండానే బ్యాంకు నుండి రిలీజ్ అయిన బంగారంపై బాధ్యత ఎవరిది అనేది ప్రశ్న.

తాజావార్తలు