మనుషుల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు మీవి


అవినీతి ఎలా నిర్మూలిస్తారో చెప్పండి
ప్రజాధనం లూటీ, కార్పొరేట్లకు అందలం
అదే గుజరాత్‌ నమూనా : రాహుల్‌
పాట్నా, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :
బీజేపీవి మనుషుల మధ్య చిచ్చుపెట్టే రాజకీ యాల ని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. అవినీతిని నిర్మూలిస్తామని గొప్ప లు చెప్పుకుంటున్న బీజేపీ అది ఎలా చేస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌లోని కిషన్‌ గంజ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచా రంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు దక్కాల్సిన నిధులు, పథకాలను బడా సంస్థలకు కట్టబెట్టడం ద్వారా మోడీ గుజరాత్‌వాసులకు తీర ని అన్యాయం చేసిందని ఆరోపించారు. దానిని క ప్పి పుచ్చుకునేందుకే గుజరాత్‌ అభివృద్ధి నమూనా తో ఆ రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించినట్లు తప్పు డు ప్రచారంతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని మండిపడ్డారు. మోడీ
వూకదంపుడు ఉపన్యాసాలకు స్వస్తిచెప్పి ప్రజలను తప్పుదోవపట్టించే రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. గుజరాత్‌లో టాటా మోటార్స్‌ స్థాపించిన నానో కార్ల కర్మాగారంలో తయారయ్యే ప్రతి కారు వ్యయంలో దాదాపు రూ. 40 వేలను మోడీ ప్రభుత్వం భరిస్తోందని, అంతేకాక ఆ కంపెనీకి రూ. 10 వేల కోట్లను 0.1 శాతం వడ్డీపై రుణంగా ఇచ్చిందని ఆయన ఆరోపించారు. గుజరాత్‌ సంపదను మోడీ టాటా మోటార్స్‌కు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. సామాన్యులు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు 12 శాతం వడ్డీ చెల్లిస్తుండగా టాటా వడ్డీ చెల్లిస్తుండగా టాటా మోటార్స్‌ లాంటి కార్పొరేట్‌ దిగ్గజానికి నామమాత్రపు వడ్డీకి వేలకోట్లు ఇవ్వడం ద్వారా కార్పొరేట్లపై తనకున్న ప్రేమను మోడీ చాటుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో విద్య, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తున్న మొత్తం రూ.10 వేల కోట్ల కన్నా తక్కువేనని, ఇది మోడీ ఊదరగొడుతున్న గుజరాత్‌ అభివృద్ధి నమూనా అని తేల్చిచెప్పారు. మోడీ మాటలు నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని హెచ్చరించారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనా దేశంలోని అన్ని ప్రాంతాలకు ఎలా పనికి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు కీడు చేసే శక్తిసామర్థ్యాలున్న బీహారీయులు మోడీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్డేయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు పలకొద్దని కోరారు. ప్రస్తుతం కొన్ని శక్తుల దిగ్బంధంలో చిక్కుకోవడంతో బీహార్‌ వెనుకబడి ఉందని, ఒక్కసారి దాని నుంచి బయటపడితే తర్వాత బీహార్‌ను అభివృద్ధిలో ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. బీహార్‌ అభివృద్ధికి, బీహారీయుల సర్వతోముఖాభివృద్ధికి యూపీఏ శాయశక్తులా కృషి చేస్తోందని అన్నారు.