అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

nara-chandrababunaidu
అసెంబ్లీలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం
అమరావతి: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. దాదాపు 3 గంటల పాటు ఏక ధాటిగా ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా అమరావతి ఉంటుందన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణం తనకు రెండు కళ్లలాంటివని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వపడే స్థాయిలో రాజధానిని నిర్మిస్తామన్నారు. పోలవరాన్ని అనుకున్న సమయంలో పూర్తిచేస్తామని ప్రకటించారు.

ప్రసంగంలో ముఖ్యాంశాలు..
* 28 శాతం వర్షపాతం తక్కువైనా వ్యసాయంలో 14.03 శాతం వృద్ధి రేటు సాధించం.
* ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రూ.149లకే వైఫై
* ఎస్టీల పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా వారి కోసం సబ్‌ప్లాన్‌లు ప్రవేశపెట్టాం. ఎస్సీ, ఎస్టీలకు 75 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తాం.
* అమరావతిలో అంబేడ్కర్‌ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తున్నాం. 120 అడుగుల అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాం ఏర్పాటు చేస్తాం. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం.
* విశాఖలో అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తాం. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే అరకు కాఫీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం.

* ముస్లింల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఇమామ్‌లకు రూ.5వేలు, మౌజమ్‌లకు రూ.3వేలు గౌరవ వేతనం అందిస్తున్నాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.
* క్రిస్టియన్‌ మైనార్టీకి రూ.35 కోట్లు. గుంటూరులో క్రిస్టియన్‌ భవనం. చర్చిల నిర్మాణానికి రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకు నగదు సాయం.
* అందరికీ ఆమోదయోగ్యంగా కాపులకు రిజర్వేషన్లు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వానిది. చేనేత కార్మికులు రూ.110 కోట్ల రుణమాఫీ చేశాం

* విశాఖలో 34వేల మంది పేదలకు రూ.8వేల కోట్ల విలువైన ఆస్తిని అవినీతి లేకుండా పంచిపెట్టిన ఘనత తెదేపా ప్రభుత్వానిది
* ఈ ఏడాది రాష్ట్రంలో పట్టాలు ఇచ్చి ఇంటి జాగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం
* ఉచితంగా డయాలసిస్‌ సేవలందిస్తున్నాం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నివారణకు పూర్తి చర్యలు తీసుకుంటాం
* వంశధార ప్రాజెక్టును శరవేంగంగా పూర్తిచేస్తాం. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లిచ్చాం.

తాజావార్తలు