గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటాం

` అమృత్‌ టెండర్లపై భారాస ఆరోపణలు అవాస్తవం
`‘లగచర్ల’ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదు
` ఢల్లీి పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
` న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.దిల్లీలో రేవంత్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. ఈ`రేస్‌ స్కామ్‌ నుంచి తప్పించుకొనేందుకే కేటీఆర్‌ దిల్లీ వచ్చారని అన్నారు. గవర్నర్‌ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. గవర్నర్‌ అనుమతి నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్‌ దిల్లీ వచ్చారన్నారు. అవినీతి పార్టీ భాజపాను అంతం చేస్తామన్న కేటీఆర్‌.. ఇప్పుడు ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారని సీఎం ప్రశ్నించారు. భాజపా`భారాస చీకటి బంధం బయటపడుతుందని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ’’అమృత్‌ టెండర్లపై భారాస చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. రెడ్డి పేరు విూద ఉన్న వారంతా నా బంధువులు కాదు. సృజన్‌ రెడ్డి భారాస మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి అల్లుడే. భారాస హయాంలో సృజన్‌ రెడ్డికి రూ.వేల కోట్ల పనులు కేటాయించారు. అమృత్‌ టెండర్లలో అవినీతి జరగలేదని ఉపేందర్‌ రెడ్డే చెప్పారు. ఈ టెండర్ల గురించి ఇష్టమొచ్చిన చోట మొరపెట్టుకో కేటీఆర్‌. కోర్టుల్లో కేసులు వేస్తామన్నా.. వేసుకోండి’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడిని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. నిందితులు ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించారు. దాడులు చేసిన వారిని.. చేయించిన వారిని.. ఎవర్నీ వదలబోమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు భారాస హయాంలో జరిగితే సమర్థిస్తారా? అధికారులపై దాడులను భారాస ఎందుకు ఖండిరచదు? అని ప్రశ్నించారు. పైగా దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని, దాడులను ప్రోత్సహించేందుకే పరామర్శలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటే.. భాజపాకి సహకరించినట్లు కాదా? అని సీఎం ప్రశ్నించారు.