హామీలు అమలు చేసిచూపిస్తుంటే వైఫల్యమంటారా!
` దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలవబోతోంది
` అధికారం కోల్పోయినప్పుడల్లా భారాస ప్రజలను రెచ్చగొడుతోంది:డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్(జనంసాక్షి):అధికారం కోల్పోయినప్పుడల్లా భారాస నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. ప్రభుత్వ వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో విూడియాతో భట్టి మాట్లాడారు. ’’నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? రైతు రుణమాఫీ చేయడం వైఫల్యమా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా? ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని. కక్ష పూరిత రాజకీయాలకు మేం వ్యతిరేకం. ప్రతిపక్షంగా భారాస తన పాత్ర పోషించిందా? ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెట్టింది. కులగణన చేస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారం చేసి చూపిస్తున్నాం. ఇది విప్లవాత్మక నిర్ణయం.. రాష్ట్రాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుంది. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు తయారు చేశాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు.
లైఫ్ సైన్సెస్ కేంద్రంగా హైదరాబాద్
` ఈ రంగంలో పది నెలల్లో రాష్ట్రానికి 140 ప్రాజెక్టులు
` రూ.36వేల కోట్ల పెట్టుబడులు
` ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరారాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజధాని హైదరాబాద్ లైఫ్ సైన్స్‌కి హబ్‌గా మారిపోయిందని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్‌లో గత 10 నెలల్లో 140 ప్రాజెక్ట్స్ వచ్చాయని.. రూ.36000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చామని తెలిపారు. దీనివల్ల 51,000ల మందికి ప్రత్యక్ష ఉపాధి, 1.5 లక్షల మందికి పరోక్షణగా ఉపాధి లభించనుందన్నారు. ప్రభుత్వం మారినా పథకాలను కొనసాగిస్తూ.. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. జీనోమి వ్యాలీ థర్డ్ ఫేజ్‌లో భాగంగా రాష్టాన్రికి భారీ కంపెనీలు వస్తున్నాయని.. యూరోపియన్‌కి చెందిన క్రికా సంస్థ రూ.2000 కోట్లతో తమ ప్లాంట్‌ని ఏర్పాటుచేయబోతుందని తెలిపారు. దీని ద్వారా 2800 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. జీనోమి వ్యాలీలో ఏడాదికి 5 కోట్ల డెంగ్యూ వాక్సిన్‌లు ప్రొడ్యూస్ చేయబోతున్నారని వెల్లడిరచారు. వరల్డ్ లీడిరగ్ బొయిటెక్నాలజీ కంపెనీ ంపణ।ని కూడా తమ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతుందని.. తద్వారా 3000 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని తెలిపారు.