అబద్దాల ప్రచారం,వాట్సాప్‌ యునివర్సీటీకి కాలం చెల్లింది

` త్యాగాల పునాధులపైనే గాంధీ కుటుంబం:
` నేను కేసీఆర్‌కు ఫైనాన్స్‌ చేశా
` కానీ టీఆర్‌ఎస్‌లో పని చేయలేదు
` చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశా…
` తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మద్దతిచ్చారు.
` దానిని వారు పెట్టుబడిగా మార్చుకున్నారు
` ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అడ్డా కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి
న్యూఢల్లీి(జనంసాక్షి):
దేశ ప్రస్తుత పరిస్థితులపై, రాజకీయాల్లో పార్టీల పాత్ర గురించి, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఫలితాలపై, దేశ ప్రజల భావోద్వేగాలను బీజేపీ సొమ్ము చేసుకుంటున్న వైనంపై ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అడ్డా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముచ్చటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
నెంబర్లు చూస్తేనే తెలుస్తుంది గెలుపు కాంగ్రెస్‌దేనని..
ఈ దఫా 400 సీట్లు అన్న వారు… 240 సీట్లు సాధించారు… కాంగ్రెస్‌ 40 నుంచి వందకు చేరింది.. నెంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోదీ ఓటమి. ప్రతి దానికి మోదీ ముద్ర వేశారు.. మోదీ గ్యారంటీ అన్నారు… మోదీ గ్యారంటీకి సంబంధించిన వారంటీ పూర్తయిందని నేను ఎన్నికలకు ముందే చెప్పాను. ఇప్పుడు నాయుడు, నితీశ్‌ కొందరి సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది.. ఇది మోదీ ఓటమే..
సర్కార్‌ ఏర్పాటు చేయడమే కాదు.. పదేళ్లలో మోదీ ఈ దేశ ప్రజలను ఎలా మోసం చేశారో చెప్పగలిగాం. అన్నదాతలకు వ్యతిరేకంగా పని చేశారు.. రాజ్యాంగం రద్దుకు మోదీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించింది మేం చెప్పగలిగాం.. బీజేపీ రహస్య జెండాను బయటపెట్టాం.. బీజేపీ రహస్య అజెండా వేరు.. ఎన్నికల ముందు చెప్పే అజెండా వేరు..
కాంగ్రెస్‌ గత అయిదు నెలల్లో ఏం నేర్చుకుంది…?
నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా… కాంగ్రెస్‌ ఫార్మాట్‌ మార్చుకోవాలి… కాంగ్రెస్‌ నాయకులు టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నారు… ఇప్పుడు 20`20 ఫార్మాట్‌ నడుస్తోంది. మేం ఫార్మాట్‌ ఆడాలి. లేదా ఫార్మాట్‌ మార్చుకోవాలి.. బీజేపీ ఉంచడమో.. ఖతం చేయడమో తీరులో ఉంటుంది. మాకు మానవీయ స్పర్శ ఉంటుంది. మేం అలా చేయం.. అవసరాలు.. వ్యాపార రీతిలో బీజేపీ రాజకీయాలు ఉంటాయి.. కాంగ్రెస్‌ తాతతండ్రులను గుర్తుపెట్టుకుంటుంది.. వారి సంక్షేమానికి కృషి చేస్తుంది..
మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై…
ప్రతి నేత కుర్చీపై ఆలోచిస్తారు.. కుర్చీ కోసం విభజన రాజకీయాలు దేశానికి మంచిది కాదు.. ఎన్నికలు గెలుపుఓటముల ప్రాధాన్యం కాదు.. విభజన రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఎన్నికల గురించే మోదీ ఆలోచిస్తారు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సవిూక్ష ఉండదు… ఎంత మంచి ఔషధానికైనా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది.. ఇప్పుడు విభజన కార్యక్రమాలకు గడువు ముగిసింది. కాంగ్రెస్‌ కు జాతీయ దృక్ఫథం ఉంది.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.. రాహుల్‌ గాంధీ ప్రభుత్వ వ్యవహారాల్లో పెద్దగా ఇన్వాల్వ్‌ కాలేదు… 2014 నుంచి 2024 వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయినా రాహుల్‌ గాంధీ మైదానాన్ని వీడలేదు…కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 150 రోజులు 4 వేల కిలోవిూటర్లు ఆయన పాదయాత్ర చేశారు.. ఈ దేశ ప్రజల కోసం ఏ నేతైనా అంత దూరం పాదయాత్ర చేశారు… మణిపూర్‌లో అల్లర్లు జరిగితే మణిపూర్‌ నుంచి ముంబయి వరకు పాదయాత్ర చేశారు.. దేశంలో పవర్‌ పాలిటిక్స్‌కు గాంధీ కుటుంబం దూరంగా ఉంటుంది.. అల్లర్ల సమయంలో విద్వేష వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచేందుకు మేం ప్రయత్నిస్తున్నానని రాహుల్‌ గాంధీ తెలిపారు… దానిపైనా వారు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.. వాట్సాప్‌ యూనివర్సిటీ రోజులు ముగిశాయి.. మాట్లాడితే కుటుంబ రాజకీయాలు అంటున్నారు.. రాహుల్‌ గాంధీ మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరైనా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అయ్యారా..? విూరే చెప్పండి.. ఆ కుటుంబం అంత త్యాగాలు ఎవరు చేశారో చెప్పండి.. ఇందిరాగాంధీ, రాహుల్‌ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారు.. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, మోతీలాల్‌ నెహ్రూ పదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు ప్రధానమంత్రి పదవి స్వీకరించే అవకాశం వచ్చినా వదులుకున్నారు… మన్మోహన్‌ సింగ్‌, ప్రణబ్‌ ముఖర్జీలకు ఉన్నత స్థానాల్లో అవకాశం ఇచ్చారు… పి.వి.నరసింహారావును ప్రధానమంత్రిని పని చేశారు. రాహుల్‌ గాంధీ అనర్హత వేటు వేశాక ఆయన తుగ్లక్‌ రోడ్డు నుంచి ఇల్లు ఖాళీ చేయిస్తే వెళ్లడానికి ఆయనకు ఇల్లు లేదు.. దేశంలో మూలమూలన ఉన్న ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి.. కానీ అదే ఇందిరమ్మ మనవడికి ఉండడానికి ఒక్క గది లేదు. పైగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.. ఆ రాష్ట్రం ఏటీఎం.. ఈ రాష్ట్ర ఏటీఎం అని ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ అంటున్నారు.. ఎవరో కార్యకర్త, చిన్నాచితకా నేత అంటే వదిలేయవచ్చు.. గాంధీ కుటుంబానికి తెలంగాణ ఏటీఎం మోదీ అంటున్నారు. అది సరైంది కాదు.. గాంధీ కుటుంబానికి పైసలు అవసరమైతే.. ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమిటి..? సొంత ఇల్లు.. సొంత వాహనాలే లేనప్పుడు వాళ్లకు పైసలు ఎందుకు..?
ఆ కుటుంబం అన్ని త్యాగాలు చేసినా ఓటర్లు ఎందుకు కాంగ్రెస్‌ వైపు మొగ్గడం లేదు..?
తరాల అంతరం..(జనరేషన్‌ గ్యాప్‌).. గతంలో అమ్మమ్మనానమ్మలు వంట చేసేంత వరకు రెండు మూడు గంటలు వెయిట్‌ చేసేవాళ్లం.. లేదా మంచి హోటల్‌కు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు స్విగ్గీలో అర్డర్‌ ఇస్తే రెండు నిమిషాల్లో ఆర్డర్‌ వస్తోంది.. మనం అమ్మ, అమ్మమ్మ, నానమ్మలపై ఆధారపడడం లేదు.. స్విగ్గీపై ఆధారపడుతున్నాం.. ఇప్పడు రాజకీయాల్లోనూ స్విగ్గీ రాజకీయాలు ఎక్కువయ్యాయిసరళీకరణ (లిబరలైజేషన్‌) తర్వాత సిద్ధాంతపరమైన రాజకీయాలు, ఆలోచనలు, అనుసంధానత తగ్గిపోయింది. సరళీకరణ తర్వాత మాకు ఎంత త్వరగా ఉద్యోగం వస్తుంది.. ఎంత త్వరగా సంపాదిస్తాం అని ఆలోచిస్తున్నారు. మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు మేమే వాల్‌ రైటింగ్‌ చేసేవాళ్లం. జెండాలు కట్టేవాళ్లం..ప్రదర్శనలకు (ర్యాలీ) వెళ్లేవాళ్లం… మా జేబులోని డబ్బులు ఖర్చుపెట్టుకొని పని చేసేవాళ్లం.. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది.. ముఖ్యమంత్రిగా, మాజీ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న నేను ఎక్కువగా చెప్పకూడదు.. విూరే చెప్పండి.. విూరే అర్ధం చేసుకోండి.. ఎందుకు అదంతా మారింది. దానికి బాధ్యత బీజేపీ.. బీజేపీ తప్పిదాలు..భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా వారు లబ్ధిపొందుతున్నారు.ఎన్నికల ముందు పుల్వామా, అయోధ్య రామమందిరం.ఇలా ఏదో ఒక భావోద్వేగం రెచ్చగొడుతున్నారు.. బీజేపీకి జాతీయ ప్రయోజనాల కన్నా భావోద్వేగ రాజకీయాలు చేయడం తెలుసు.
రాజకీయాలు భావోద్వేగాలతో ముడిపడినవి.. వాటిని ఎలా అధిగమిస్తారు..?
విూరు మూడో తరం పాత్రికేయుడు.. రామ్‌నాథ్‌ గోయెంకా… ఆనంద్‌ గోయెంకా.. తర్వాత విూరు.. విూరే చెప్పండి.. విూకు విస్తృతమైన అనుభవం ఉంది. అటువంటి వాటిని ఎలా అధిగమించవచ్చో చెప్పండి.. విూ కుటుంబం దేశానికి సేవ, త్యాగాలు చేసింది.. విూరే మాకు, దేశానికి సూచించండి.. అవకాశాల్లో ప్రతి ఒక్కరూ సమానమే.. ప్రతి ఒక్కరూ సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం నుంచి ఆశిస్తారు.. మమ్మల్ని విస్మరించే వాళ్లు మాకు అవసరం లేదంటారు.. రాజకీయాల్లో రెండు భాగాలున్నాయి. రామ్‌నాధ్‌ గోయెంకా నుంచి అనంత్‌ గోయెంకా వరకు ఒక వరస ఉంది.. రాహుల్‌ గాంధీ విషయంలోనూ అదే తీరు.. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ.. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ నుంచి రాహుల్‌ గాంధీ.. ఇది మా కుటుంబం బాధ్యత అనుకుంటారు… వాళ్లు లాభనష్టాలు చూసుకోరు… మరో భాగానికి వస్తే మా నాన్న రైతు. నేను రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రెండు వర్గాల ప్రజల ఆలోచన విధానాలు వేర్వురుగా ఉంటాయి.. ఒకరిది బాధ్యతాయుత రాజకీయాలు.. మరొకరిది రాజకీయాల్లో రావాలనే ఆకాంక్ష.. కొత్త తరం వారికి త్వరగా కుర్చీలో కూర్చోవాలనే తాపత్రయం.. ఈ క్రమంలో లెక్కలు మారుతున్నాయి..