మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణలో భవన్ లో నిర్వహించటం సంతోషంగా ఉంది
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కేటీఆర్.
మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణలో భవన్ లో నిర్వహించటం సంతోషంగా ఉంది.2014 లో తెలంగాణ ఏర్పడినప్పుడు హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరగుతాయని అనుమానాలు వ్యాప్తి చేశారు.కానీ కేసీఆర్ పదేళ్ల హయంలో గంగా-జమున తహజీబ్ ను పాటించటంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేశారు.కేసీఆర్ మనిషిని, మనిషిగా మానవత్వంతో చూశారు. కానీ మత పరంగా, ఓట్ల పరంగా చూడలేదు.అన్ని మతాల వారికి మేలు చేసే విధంగా బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్ మస్ కానుకలు ఇచ్చారు.అందరినీ కలుపుకొని పోతామని చాలా మంది చెబుతారు. కానీ కేసీఆర్ చేసి చూపించారు.మన పిల్లలకు ఎంత మంచి విద్యను అందిస్తే రాష్ట్రం భవిష్యత్ అంత బాగుంటుందని కేసీఆర్ నమ్మారు.200 లకు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. దాదాపు లక్షా 40 వేల మంది విద్యార్థులపై ఏటా రూ. లక్షా 20 వేల ఖర్చు చేశారు.మైనార్టీలకు మంచి విద్యాను అందించేందుకు కేసీఆర్ ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారు.మైనార్టీ గురుకుల స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్మాత్మక విద్యాసంస్థల్లో చదువుతూ రాష్ట్రం గర్వపడేలా చేస్తున్నారు. అది ఎంతో సంతోషానిస్తోంది.మౌలానా అబుల్ కలాం గారి పేరుతో 2, 751 మంది మైనార్టీ విద్యార్థులకు రూ. 20 లక్షలు రూపాయలు ఇవ్వటం జరిగింది. దాదాపు రూ. 438 కోట్లు ఖర్చు చేశారు.నాంపల్లి లో 100 కోట్ల రూపాయల విలువ గల 2 ఎకరాలు భూమి కేటాయించి రూ. 40 కోట్లతో అనిసిల్ గుర్బా ను నిర్మించారు.మక్కా మసీదు మరమత్తుల కోసం రూ. 9 కోట్లు ఖర్చు చేశారు.ఇస్లామిక్ సెంటర్ కోసం రూ. 40 కోట్లతో సెంటర్ ను కోకాపేటలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు.రూ. 10 వేల కోట్ల రూపాయలతో మైనార్టీ సంక్షేమం కోసం దేశంలోనే ఎవరు ఖర్చు చేయని విధంగా కేసీఆర్ చేశారు.దేశంలో ఎక్కడ లేని విధంగా షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షా ఇచ్చారు.ఇమామ్, మౌలానాలకు రూ. 5 వేలు నెలకు ఇచ్చారు.తెలంగాణ ఏర్పడిన వెంటనే మైనార్టీ కి డిప్యూటీ సీఎం గా చేశారు. హైదరాబాద్ లో డిప్యూటీ మేయర్ పదవిని కూడా ముస్లింలకు ఇచ్చింది.అందరినీ కలుపుకొని వెళ్లే ఉద్దేశంతో అన్ని వర్గాలకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. కానీ వాటిని ఎక్కడ ప్రచారం చేసుకోలేదు.కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రేమ దుకాణం అంటూ మాట్లాడారు. కానీ అన్నీ విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు.ఆరు గ్యారంటీలు, 420 హామీలు వదిలి వేశారు. మొత్తం అన్ని వర్గాలను పట్టించుకోవటం మానేశారు.ఇప్పుడు ఒక్క మూ పేరుతో 16 వేల పేదల ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.గరీబులు, పేదల కోసం చిత్తశుద్ధితో మంచి చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంమైనార్టీ డిక్లరేషన్ పేరుతో వాళ్లు చాలా హామీలు ఇచ్చారు.ఆరు నెలల్లో మైనార్టీ జన గణన అన్నారు. జనాభా కు అనుగుణంగా ఉద్యోగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు కల్పిస్తామన్నారు.మైనార్టీ సబ్ ప్లాన్ అన్నారు. రూ. 4 వేల కోట్లు ఏటా ఖర్చు చేస్తా అన్నారు. ఏమీ చేస్తారో చూద్దాం.వెయ్యి కోట్లతో మైనార్టీల ఉపాధికి లోన్లు ఇస్తామన్నారు. కానీ రూ. లక్ష కూడా ఇవ్వలేదు.మౌలానా ఆజాద్ పేరుతో తోఫా ఏ తలీమ్ అన్నారు. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.పీహెచ్డీ, పీజీ చేసిన వాళ్లకు రూ. 5 లక్షలు అన్నారు. కానీ ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు.ఇమామ్ లు, మౌలనాలకు రూ. 12 వేలు ఇస్తామంటూ వాగ్దానం చేశారు.ఇళ్లు లేని వారికి రూ. 5 లక్షలు, అదే విధంగా ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారు.షాదీ ముబారక్ పేరుతో రూ. లక్షా 5 వేలు, అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నారు.ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దానాలు చేసి మీ ఓట్లువేయించుకొని గద్దెనెక్కారు.మెహబ్బత్ దుకాణం అన్నారు. కానీ ఇప్పుడు విద్వేషాల రాజకీయాలు చేస్తున్నారు.కేసీఆర్ హయాంలో ఒక్క గంట కూడా కర్ఫ్యూ విధించాల్సి పరిస్థితి లేకుండా పరిపాలన చేశారు.కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈ దసరా, దీపావళి సందర్భంగా ఒక నెల మొత్తం ఇప్పుడు కర్ఫ్యూ విధించారు.అందుకే కేసీఆర్ ఎక్కడ. ఈ చిచోరా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ?వరంగల్ కు వెళితే అక్కడ ప్రజలు ఇంకా నాలుగేళ్లు ఈ ప్రభుత్వాన్ని భరించాలా అని బాధపడుతున్నారు.ఈ ప్రభుత్వం వద్దు అని వాళ్లను పడగొట్టేందుకు ఇంకే మార్గం లేదా అన్నారు. కానీ ఒక్కసారి ఓటు వేస్తే ఐదేళ్లు వాళ్లను భరించాల్సిందే.దాదాపు 60 ఏళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్లు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూడొచ్చు.అందరీ సంక్షేమం కోసం పనిచేసిన కేసీఆర్ గారికి తప్పకుండా మీరు మళ్లీ అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది.