ఈఎస్‌ఐ వ్యవహారంలో మరో మలుపు

హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి):తెలంగాణలో సంచలనం సృష్టించిన కార్మిక వైద్య బీమా సేవల సంస్థ (ఈఎస్‌ఐ) మందుల కొనుగోలు కుంభకోణంలో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది.  విభాగం అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు కలిసి భారీగా దండుకున్నట్టు అనిశా అధికారులు గుర్తించారు. ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో దాదాపు రూ. వెయ్యి కోట్ల మేర ఔషధాల కొనుగోళ్లు జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు.. ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10 డిస్పెన్సరీల నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకొనివిచారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్‌ ఏజెన్సీల కార్యాలయాల్లో అనిశా అధికారుల 5 సోదాలు కొనసాగుతున్నాయి. ఒమ్ని మెడి ఉద్యోగి నాగరాజు ఇంట్లో రూ.46 కోట్ల విలువైన నకిలీ ఇండెట్లను 5 అనిశా అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పలువురు ఈఎస్‌ఐ ”ఉద్యోగుల సంతకాలను సైతం సేకరించారు. మరో రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని అనిశా అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

తాజావార్తలు