ఏపీ లో ‘ఫైబర్‌ గ్రిడ్‌’..!!

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి. రూ.149కే కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు అందించే ఈ ‘సాంకేతిక విప్లవం’ జనవరి మొదటి వారంలో మొదలవుతుంది. సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా అందుబాటులోకి వస్తుంది. దీనికి అవసరమైన రుణం, ఇతర ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆchandrababunaiduమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించిన వివరాలను మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, పైబర్‌ గ్రిడ్‌ సీఈవో సాంబశివరావు మీడియాకు వివరించారు. దీని ప్రకారం… ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు బ్యాంకుల నుంచి రూ.300కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి రూ.100కోట్లు… వెరసి రూ.400కోట్ల రుణం తీసుకుంటారు. అదేవిధంగా టీవీ ప్రసారాలు, వైఫై, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవల కోసం పది లక్షల ఐపీటీవీ, జీపాన్‌ బాక్సులు కొనుగోలు చేస్తారు. వీటి ద్వారా పది లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తారు. బహిరంగ మార్కెట్లో జీపాన్‌ బాక్కు ఒక్కటే రూ.14,500 ఉంటుంది.

తాజావార్తలు