కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
అనంతపురం,మే7(జనంసాక్షి): టిడిపి కార్మికుల పక్షం అని చెప్పుకుంటూ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ అన్నారు. కార్మిక యూనియన్లు కోరుతున్న విధంగా ఉద్యోగులకు ఇతర ఉద్యోగులతో సహా 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని అన్నారు.. ఒక ప్రైవేట్ బస్సుకు నెంబరు ఉంటే దానిపై పది బస్సులను తిప్పుతున్నారని వాటిని ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. దీనిపై చర్య తీసుకుంటే ఆర్టీసీకి నష్టాలు రావన్నారు. ఇకపోతే ప్రత్యేక ¬దాపై కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం తలపెట్టిందని అన్నారు. వెనుకబడిన రాయలసీమ అభివృధ్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన ప్రాంతాలకు విద్యా, వైద్యం, సాగునీరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఇచ్చిన హావిూ ఏమైందని ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ఎపికి ప్రత్యేక ¬దా ఇవ్వడం కుదరదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పడం అన్యాయమన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక ¬దా కల్పిస్తామని బిజెపి, తెలుగుదేశం పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నాయని అన్నారు. యుపిఎ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తాము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక ¬దా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. ఈ రెండు సంవత్సరాల్లో అదే మాటనే
పలుమార్లు చెబుతూ వచ్చారన్నారు. ప్రస్తుత అధికార పార్టీలు ప్రజలకు ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిందేనని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు బిజెపి ప్రభుత్వం నుంచి వీడాలని, వారి కేంద్ర పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.