కాశ్మీర్‌ పర్యాటకానికి మంచి రోజులు

– వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవంలో అమిత్‌ షా
న్యూఢిల్లీ,అక్టోబర్‌ 3 (జనంసాక్షి):పర్యాటకంగా కాశ్మీర్‌ మరింత అభివృద్ది చెందగలదని, కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా అన్నారు. గురువారం వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రారంభించారు. కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, హర్షవర్దన్‌ తదితరులతో కలిసి దిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రైలుకు జెండా ఊపారు. ఈ సందర్భంగా అమిత్‌ షా  మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ఈ రైలు పెద్ద బహుమతి అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఆర్టికల్‌ 370 జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని చెప్పారు. రాబోయే పదేళ్లలో జమ్మూకశ్మీర్‌ను అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. 2022 ఆగస్టు 15 నాటికి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైల్వేలను అనుసంధానం చేస్తామన్నారు. కాట్రాలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది. అక్టోబర్‌ 5 నుంచి ఈ రైలు కమర్షియల్‌ సేవల్ని కొనసాగించనుంది. ఈ రైలులో ప్రయాణించేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లను అందుబాటులో ఉంచారు.
ఇది దసరా కానుక: మోదీ
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో స్పందించారు. వైష్ణోదేవి భక్తులైన సోదర సోదరీ మణులకు ఈ రైలు దసరా కానుకగా అభివర్ణించారు. ఇది ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు.ఇప్పటికే దిల్లీ నుంచి వారణాసికి ఒక వందే భారత్‌ రైలు సేవలందిస్తోంది. ఈ రోజు ప్రారంభించిన రైలు రెండోది కావడం విశేషం. 22439 నంబర్‌ కల్గిన దిల్లీ – కాట్రా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 6గంటలకు దిల్లీలో బయల్దేరనుంది. మధ్యాహ్నం 2గంటల సమయానికి కాట్రా చేరుకుంటుంది. మంగళవారం మినహయిస్తే ప్రతి రోజూ ఈ రైలు సేవలందించనుంది. అంబాలా, లుథియానా, జమ్మూతవి స్టేషన్లలో రెండు నిమిషాల చొప్పున ఆగనుంది. తిరుగు ప్రయాణంలో 22440 నంబర్‌ కల్గిన వందే భారత్‌ రైలు కాట్రా స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3గంటలకు బయల్దేరి రాత్రి 11గంటలకు దిల్లీకి చేరుకోనుంది. ఈ రైలు టికెట్‌ కనీస ధర రూ.1630లు కాగా.. గరిష్ఠ ధర రూ.3015లుగా నిర్ణయించారు.

తాజావార్తలు