ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ

ఫత్తేకాన్‌పేట: నెల్లూరు బారాషాహీద్‌ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. బారాషాహీద్‌ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ముజావర్లు పండుగను ప్రారంబించారు. మొదటి రోజే దర్గాకు భక్తజనం పోటెత్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో దర్గా దారులన్ని రద్దీగా మారాయి.బారాషాహీద్‌ల దర్శనానికి భక్తులు బారులు తీరారు.  బారాషాహీద్‌లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కొర్కెల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు కొర్కెల రొట్టెలు మార్చుకుంటున్నారు.భక్తుల సౌకర్యార్ధం ఈ ఏడాది ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 4.60 కోట్ల రూపాయలతో ఘాట్లు ఏర్పాటు చేయడంతో స్వర్ణాల చెరువులోనే భక్తులు స్నానమాచరిస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రొట్టెలు మార్చుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘ‌టనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. దర్గా ఆవరణలోకి వెళ్లే మార్గాల వద్ద మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.
 

తాజావార్తలు